1950-2015 వరకూ విడుదలైన మెజారిటీ హిట్ సినిమాల ఏకైక కథని అంశంగా తీసుకున్నారు శ్రీమతి విజయలక్ష్మి. మొత్తంగా స్క్రీన్ ప్లే, చాలావరకూ మాటలు, పాటలకు మకుటాలు సమకూర్చిన ఈ కథ - పేరుకి తగ్గట్టే సిద్ధంగా ఉన్న సినిమా స్క్రిప్టు. ఆద్యంతం సినీరంగంపట్ల అవగాహన ద్యోతకమయ్యే ఈ రచనలో ప్రతి వాక్యమూ అర్థవంతం. హాస్యం 'జబర్దస్తు'గా ఉంటే తప్ప నవ్వలేనివారిని కూడా కడుపుబ్బ నవ్వించగల ఈ రచనలో - సభ్యతకూ, సంస్కారానికీ లభించిన ప్రాధాన్యం గమనార్హం. ఇక స్థాయి పరంగా, 'ఫోర్త్ డైమన్షన్'ని అజరామరం చేసిన కొడవటిగంటి చేత సెబాసనిపించుకోగల ఓ చిన్న సన్నివేశం మచ్చుకి ఈ రచన నుంచి -
.... డాక్టరు దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళజోడు పట్టుకొని,'చూడండి, అతనికి చాలా బలమైన గాయాలు తగిలాయి. రెండు గునపాలు పొడుచుకున్నాయి కదా! వెన్నెముక మధ్యకి విరిగిపోయింది. లివరు చిరిగి పీలికలు పీలికలు ఐపోయింది. కిడ్నీలు రెండూ కన్నాలు పడిపోయాయి. కడుపు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. గుండెకు రూపాయ కాసంత కన్నం పడడంవల్ల రక్తం విపరీతంగా పోయింది' అని, 'కంగారు పడకండి. ప్రాణాపాయం ఏమిలేదు. రక్తం ఎక్కించాలంతే!' అన్నాడు. ఈ హాస్యం వినోదానికి కాక, వినోదాన్ని పంచాల్సిన చలనచిత్ర రంగంలో భావదారిద్ర్యంపట్ల ఆవేదనని ప్రకటించడానికి ఉద్దేశించబడింది. ఉత్తమ హాస్యం విషాదంలోంచి పుడుతుందనడానికి మచ్చు ఈ రచన.
- వసుంధర
1950-2015 వరకూ విడుదలైన మెజారిటీ హిట్ సినిమాల ఏకైక కథని అంశంగా తీసుకున్నారు శ్రీమతి విజయలక్ష్మి. మొత్తంగా స్క్రీన్ ప్లే, చాలావరకూ మాటలు, పాటలకు మకుటాలు సమకూర్చిన ఈ కథ - పేరుకి తగ్గట్టే సిద్ధంగా ఉన్న సినిమా స్క్రిప్టు. ఆద్యంతం సినీరంగంపట్ల అవగాహన ద్యోతకమయ్యే ఈ రచనలో ప్రతి వాక్యమూ అర్థవంతం. హాస్యం 'జబర్దస్తు'గా ఉంటే తప్ప నవ్వలేనివారిని కూడా కడుపుబ్బ నవ్వించగల ఈ రచనలో - సభ్యతకూ, సంస్కారానికీ లభించిన ప్రాధాన్యం గమనార్హం. ఇక స్థాయి పరంగా, 'ఫోర్త్ డైమన్షన్'ని అజరామరం చేసిన కొడవటిగంటి చేత సెబాసనిపించుకోగల ఓ చిన్న సన్నివేశం మచ్చుకి ఈ రచన నుంచి - .... డాక్టరు దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళజోడు పట్టుకొని,'చూడండి, అతనికి చాలా బలమైన గాయాలు తగిలాయి. రెండు గునపాలు పొడుచుకున్నాయి కదా! వెన్నెముక మధ్యకి విరిగిపోయింది. లివరు చిరిగి పీలికలు పీలికలు ఐపోయింది. కిడ్నీలు రెండూ కన్నాలు పడిపోయాయి. కడుపు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. గుండెకు రూపాయ కాసంత కన్నం పడడంవల్ల రక్తం విపరీతంగా పోయింది' అని, 'కంగారు పడకండి. ప్రాణాపాయం ఏమిలేదు. రక్తం ఎక్కించాలంతే!' అన్నాడు. ఈ హాస్యం వినోదానికి కాక, వినోదాన్ని పంచాల్సిన చలనచిత్ర రంగంలో భావదారిద్ర్యంపట్ల ఆవేదనని ప్రకటించడానికి ఉద్దేశించబడింది. ఉత్తమ హాస్యం విషాదంలోంచి పుడుతుందనడానికి మచ్చు ఈ రచన. - వసుంధర© 2017,www.logili.com All Rights Reserved.