రెండో ముద్రణకు 'నా మాట'
'చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర' రెండో ముద్రణకు ఎదిగింది. సంతోషం! రెండో ముద్రణలో అక్కడక్కడా అదనంగా సమాచారం చేర్చటం జరిగింది. చివర 'పురోగమనం' తీసేసీ ప్రపంచీకరణం దాని వల్ల వచ్చిన ధోరణులు చేర్చటం జరిగింది.
ఈ సాహిత్య చరిత్రనే మొదట్లోనే ప్రక్రియాపరంగా యుగ విభజన చేద్దామని చూసాను.. కాని ఆ పద్ధతి అంతగా అవగాహనను కలిగిస్తున్నట్లుగా నాకనిపించలేదు. మొదటి (వీరేశలింగం కవుల చరిత్ర కాలం) నుంచి మనం కవులకే పట్టం కట్టటం వల్లనో యేమో కవుల పేరుతో యుగవిభజన చేయటంతో తెలుగు సాహిత్యావగాహన సుగమం అవుతున్నది. సంస్కృత సాహిత్య చరిత్రను ప్రక్రియపరంగా వ్రాయటం సులభం. అంతేగాక అవగాహనకు అనువైంది. అదే పద్ధతిలో ప్రక్రియాపరంగా తెలుగు సాహిత్య చరిత్రను విభజించి వ్రాద్దామా అని చూసాను. కాని కవుల పేర్లతో గాని లేదా రాజవంశాల పేరుతో గాని విభజించి వ్రాయడం వల్లనే అవగాహన సౌలభ్యం వుందని అనిపించింది. నేను కవుల పేర్లతో యుగ విభజన పద్ధతిని తీసుకున్నాను. అక్కడికీ నన్నయ తిక్కనల మధ్య కాలాన్ని "నన్నయ తిక్కనల మధ్యయుగం” అన్నాను. అదే విధంగా అత్యాధునిక ధోరణులను "అభ్యుదయానంతర విప్లవానంతర ధోరణులు - వాదాలు”గా చెప్పాను. అక్కడ వ్యక్తుల పేర్లతో చెప్పడం సాధ్యం కాలేదు.
నౌకాయానంలో వేగం సంపాదించి తమ పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు లను వెతుక్కుంటూ వచ్చి బ్రిటన్, ఫ్రెంచ్, డచ్ దేశాలు వలస దేశాలను ఏర్పరచు కున్నాయి. కమ్యూనికేషన్ పెరిగింతర్వాత "గ్లోబల్ విలేజ్" - ప్రపంచమంతా ఒక కుగ్రామంగా ఏర్పడింతర్వాత ఉత్పత్తి అయిన వస్తువులను అమ్ముకోడానికి మార్కెటుల సంపాదనలతో నూతన వలస విధానం ఏర్పడుతున్నది. ఈ వలసల క్రమంలో అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం జాతీయ సమస్యల మీద పడడం ఆరంభమైంది. కాని జాతీయ సమస్యలను ప్రాంతీయ సమస్యలను, ప్రయోజనాలను విడిచి పెట్టి అంతర్జాతీయ స్థాయిలోనే ఆలోచించటం దేశానికి జాతీయతకు మేలు జరుగదు. మన అభివృద్ధిలో పేదరిక నిర్మూలనంలో మన మౌలికత మనకుండాలి. ఇతరుల...............
రెండో ముద్రణకు 'నా మాట' 'చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర' రెండో ముద్రణకు ఎదిగింది. సంతోషం! రెండో ముద్రణలో అక్కడక్కడా అదనంగా సమాచారం చేర్చటం జరిగింది. చివర 'పురోగమనం' తీసేసీ ప్రపంచీకరణం దాని వల్ల వచ్చిన ధోరణులు చేర్చటం జరిగింది. ఈ సాహిత్య చరిత్రనే మొదట్లోనే ప్రక్రియాపరంగా యుగ విభజన చేద్దామని చూసాను.. కాని ఆ పద్ధతి అంతగా అవగాహనను కలిగిస్తున్నట్లుగా నాకనిపించలేదు. మొదటి (వీరేశలింగం కవుల చరిత్ర కాలం) నుంచి మనం కవులకే పట్టం కట్టటం వల్లనో యేమో కవుల పేరుతో యుగవిభజన చేయటంతో తెలుగు సాహిత్యావగాహన సుగమం అవుతున్నది. సంస్కృత సాహిత్య చరిత్రను ప్రక్రియపరంగా వ్రాయటం సులభం. అంతేగాక అవగాహనకు అనువైంది. అదే పద్ధతిలో ప్రక్రియాపరంగా తెలుగు సాహిత్య చరిత్రను విభజించి వ్రాద్దామా అని చూసాను. కాని కవుల పేర్లతో గాని లేదా రాజవంశాల పేరుతో గాని విభజించి వ్రాయడం వల్లనే అవగాహన సౌలభ్యం వుందని అనిపించింది. నేను కవుల పేర్లతో యుగ విభజన పద్ధతిని తీసుకున్నాను. అక్కడికీ నన్నయ తిక్కనల మధ్య కాలాన్ని "నన్నయ తిక్కనల మధ్యయుగం” అన్నాను. అదే విధంగా అత్యాధునిక ధోరణులను "అభ్యుదయానంతర విప్లవానంతర ధోరణులు - వాదాలు”గా చెప్పాను. అక్కడ వ్యక్తుల పేర్లతో చెప్పడం సాధ్యం కాలేదు. నౌకాయానంలో వేగం సంపాదించి తమ పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు లను వెతుక్కుంటూ వచ్చి బ్రిటన్, ఫ్రెంచ్, డచ్ దేశాలు వలస దేశాలను ఏర్పరచు కున్నాయి. కమ్యూనికేషన్ పెరిగింతర్వాత "గ్లోబల్ విలేజ్" - ప్రపంచమంతా ఒక కుగ్రామంగా ఏర్పడింతర్వాత ఉత్పత్తి అయిన వస్తువులను అమ్ముకోడానికి మార్కెటుల సంపాదనలతో నూతన వలస విధానం ఏర్పడుతున్నది. ఈ వలసల క్రమంలో అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం జాతీయ సమస్యల మీద పడడం ఆరంభమైంది. కాని జాతీయ సమస్యలను ప్రాంతీయ సమస్యలను, ప్రయోజనాలను విడిచి పెట్టి అంతర్జాతీయ స్థాయిలోనే ఆలోచించటం దేశానికి జాతీయతకు మేలు జరుగదు. మన అభివృద్ధిలో పేదరిక నిర్మూలనంలో మన మౌలికత మనకుండాలి. ఇతరుల...............© 2017,www.logili.com All Rights Reserved.