తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో దర్శకులు వారి నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కొందరు సఫలీకృతులయ్యారు. కానీ అత్యధిక మంది ఎటువంటి ముద్ర లేకుండా కాలగర్భంలో కలిసిపోయారు. కానీ తమకంటూ ఒక ముద్ర వేసుకున్న దర్శకులు కొందరే. ప్రేక్షకులపైన, సమాజం పైన ప్రత్యేకమైన ముద్ర వేసిన కొందరు దర్శకుల గురించే చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అతి తక్కువ సమయంలో తక్కువ సంఖ్య సినిమాలతోనే ఎక్కువ కీర్తిని పొందిన దర్శకులు టి కృష్ణ. నటుడు కావాలని ఒంగోలు నుంచి చెన్నైలో కాలుపెట్టిన కృష్ణ నటుడుగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ నటుడిలో నిస్తేజంగా దాగివున్న సాంకేతిక నిపుణుడు బయటికి వచ్చాడు. అదే దర్శకునిగా అతని తొలి చిత్రం 'నేటి భారతం'. కృష్ణ గురించి మరిన్ని సంగతులు ఈ పుస్తకంలో కలవు.
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో దర్శకులు వారి నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కొందరు సఫలీకృతులయ్యారు. కానీ అత్యధిక మంది ఎటువంటి ముద్ర లేకుండా కాలగర్భంలో కలిసిపోయారు. కానీ తమకంటూ ఒక ముద్ర వేసుకున్న దర్శకులు కొందరే. ప్రేక్షకులపైన, సమాజం పైన ప్రత్యేకమైన ముద్ర వేసిన కొందరు దర్శకుల గురించే చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అతి తక్కువ సమయంలో తక్కువ సంఖ్య సినిమాలతోనే ఎక్కువ కీర్తిని పొందిన దర్శకులు టి కృష్ణ. నటుడు కావాలని ఒంగోలు నుంచి చెన్నైలో కాలుపెట్టిన కృష్ణ నటుడుగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ నటుడిలో నిస్తేజంగా దాగివున్న సాంకేతిక నిపుణుడు బయటికి వచ్చాడు. అదే దర్శకునిగా అతని తొలి చిత్రం 'నేటి భారతం'. కృష్ణ గురించి మరిన్ని సంగతులు ఈ పుస్తకంలో కలవు.© 2017,www.logili.com All Rights Reserved.