భారతదేశంలోని గ్రామీణ వ్యవస్థను ఆదర్శవంతమైన సామాజిక నిర్మాణానికి ఒక నమూనాగా భావించేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఐతే, ఈ ఆదర్శీకరణ కేవలం హిందువుల అభూతకల్పనే తప్ప, ఎంతమాత్రమూ వాస్తవం కాదని డాక్టర్ అంబేద్కర్ ఈ రచనలో ప్రతిపాదించారు. తన వాదనకు రుజువులుగా ఆయన లెక్కలేనన్ని సాక్ష్యాలను మనముందుంచారు. ప్రాచీన హిందూమత గ్రంథాలూ, ధర్మ శాస్త్రాలు నిర్దేశించిన వర్ణవ్యవస్థ ఆధునిక భారతదేశంలోని గ్రామాల్లో నేటికీ యథాతథంగా కొనసాగుతూనే ఉంది.
ఈ దేశంలోని ప్రతివ్యక్తికీ పుట్టుకతోనే ఏదో ఒక కులం నిర్ణయమైపోయి ఉంటుంది. కులాల స్థాయినిబట్టి వ్యక్తుల ఆర్ధిక, సాంస్కృతిక, సామాజిక జేవితం నిర్దేశితమవుతుంది. ఈ కులాల సరిహద్దులను దాటటానికి ప్రత్నించినప్పుడల్లా దారుణమైన హింసాకాండ అమలవుతున్నది. ఈ సత్యాలన్నీ సోదాహరణంగా ఈ రచనలో మనకళ్ళకు కడతాయి. భారతదేశంలోని పల్లెసీమలు అగ్రవర్ణాలకు స్వర్గధామాలు కావచ్చునేమో గానే దళితులకు మాత్రం అవి నరకకూపాలని అంబేద్కర్ ఈ రచనలో స్పష్టంగా ప్రకటించారు.
భారతదేశంలోని గ్రామీణ వ్యవస్థను ఆదర్శవంతమైన సామాజిక నిర్మాణానికి ఒక నమూనాగా భావించేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఐతే, ఈ ఆదర్శీకరణ కేవలం హిందువుల అభూతకల్పనే తప్ప, ఎంతమాత్రమూ వాస్తవం కాదని డాక్టర్ అంబేద్కర్ ఈ రచనలో ప్రతిపాదించారు. తన వాదనకు రుజువులుగా ఆయన లెక్కలేనన్ని సాక్ష్యాలను మనముందుంచారు. ప్రాచీన హిందూమత గ్రంథాలూ, ధర్మ శాస్త్రాలు నిర్దేశించిన వర్ణవ్యవస్థ ఆధునిక భారతదేశంలోని గ్రామాల్లో నేటికీ యథాతథంగా కొనసాగుతూనే ఉంది. ఈ దేశంలోని ప్రతివ్యక్తికీ పుట్టుకతోనే ఏదో ఒక కులం నిర్ణయమైపోయి ఉంటుంది. కులాల స్థాయినిబట్టి వ్యక్తుల ఆర్ధిక, సాంస్కృతిక, సామాజిక జేవితం నిర్దేశితమవుతుంది. ఈ కులాల సరిహద్దులను దాటటానికి ప్రత్నించినప్పుడల్లా దారుణమైన హింసాకాండ అమలవుతున్నది. ఈ సత్యాలన్నీ సోదాహరణంగా ఈ రచనలో మనకళ్ళకు కడతాయి. భారతదేశంలోని పల్లెసీమలు అగ్రవర్ణాలకు స్వర్గధామాలు కావచ్చునేమో గానే దళితులకు మాత్రం అవి నరకకూపాలని అంబేద్కర్ ఈ రచనలో స్పష్టంగా ప్రకటించారు.© 2017,www.logili.com All Rights Reserved.