ఒక కాలానికి చెందిన నవలల్ని చదివేస్తే ఆ కాలపు సాంఘిక చరిత్ర చాలావరకు తెలిసిపోతుంది. ఈ చరిత్ర ఏ ఒక నవలలో ఉండటానికి వీల్లేదు. ఎందుచేతనంటే, నవలాకారుడు తనకు పరిచయం అయిన వాతావరణాన్ని, జీవితాన్ని, పాత్రలకి మాత్రమే సృష్టించగలడు. ఉదాహరణకు 'చదువు' అన్న నవలలో డిప్రెషన్ కు ముందు ఇరవై సంవత్సరాల సాంఘిక వాతావరణాన్ని చిత్రించ ప్రయత్నించాను. అదే కాలాన్ని తీసుకొని మరి ఇరవై మంది ఇరవై నవలలు రాయవచ్చు. "అభ్యుదయ సాహిత్యానికి సహాయంగా చదువు రాశాను. చదువు ఉద్యమ నవల కాదు." రెండు మహా ప్రపంచయుద్ధాల నడిమి కాలంలో మారుతున్న విలువలకి మారని మనుషులకు మధ్య ఏర్పడ్డ సంఘర్షణ చిత్రించబడి ఉంది. ఈ నవల తెలుగు కుటుంబాల సాంఘిక జీవితానికి, ఆనాటి చరిత్రకు దర్పణం.
ఒక కాలానికి చెందిన నవలల్ని చదివేస్తే ఆ కాలపు సాంఘిక చరిత్ర చాలావరకు తెలిసిపోతుంది. ఈ చరిత్ర ఏ ఒక నవలలో ఉండటానికి వీల్లేదు. ఎందుచేతనంటే, నవలాకారుడు తనకు పరిచయం అయిన వాతావరణాన్ని, జీవితాన్ని, పాత్రలకి మాత్రమే సృష్టించగలడు. ఉదాహరణకు 'చదువు' అన్న నవలలో డిప్రెషన్ కు ముందు ఇరవై సంవత్సరాల సాంఘిక వాతావరణాన్ని చిత్రించ ప్రయత్నించాను. అదే కాలాన్ని తీసుకొని మరి ఇరవై మంది ఇరవై నవలలు రాయవచ్చు. "అభ్యుదయ సాహిత్యానికి సహాయంగా చదువు రాశాను. చదువు ఉద్యమ నవల కాదు." రెండు మహా ప్రపంచయుద్ధాల నడిమి కాలంలో మారుతున్న విలువలకి మారని మనుషులకు మధ్య ఏర్పడ్డ సంఘర్షణ చిత్రించబడి ఉంది. ఈ నవల తెలుగు కుటుంబాల సాంఘిక జీవితానికి, ఆనాటి చరిత్రకు దర్పణం.© 2017,www.logili.com All Rights Reserved.