దళిత దార్శనికత తొణికిసలాడే కథలు
డాక్టర్ పసునూరి రవీందర్ కథలు వాస్తవ జీవితాలకు అ పడతాయి. ఆయన కథల్లో కనిపించే పాత్రలు, వాటి వ్యవహార చిత్రణ కూడా సజీవంగా ఉంటుంది. “కండీషన్స్ అప్లయ్" సంపుటిలోని కథలన్నీ ఇదే కోవలో సాగుతాయి. అంతేకాదు - వీటిని చదువుతుంటే మందిని వెంటేసుకుని సాగే దండోరా కళ్లకు కడుతుంది. ప్రశ్నల జెండాలు చేబట్టి నిలబడిన వాడల్లోకి అడుగుపెట్టిన
అనుభూతి కలుగుతుంది.
పాఠకులను మెస్మరైజ్ చేసే నెరేటివ్ స్టయిల్ పసునూరి కలానికి ఉన్న మరో బలం. ప్రామాణిక భాష సహా వాడకట్టులోని సొంపైన నుడికారంపై తనకున్న పట్టు అపారం. ఈ రెండు కారణాల రీత్యా తెలంగాణ డైలెక్ట్, దళిత ఈస్తటిక్కి రవీందర్ కథలు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. రచయితకున్న విశాలమైన సామాజిక అవగాహన, నిశిత పరిశీలన, చారిత్రిక దృక్కోణం, బలమైన తాత్విక పునాది వంటి నాలుగు అంశాలు కూడా ఈ కథల పరిపుష్టికి దోహదపడిన జీవధాతువులు.
కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం అందుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి రచయిత డాక్టర్ పసునూరి రవీందర్. వర్తమాన యువ రచయితల్లో.................
దళిత దార్శనికత తొణికిసలాడే కథలు డాక్టర్ పసునూరి రవీందర్ కథలు వాస్తవ జీవితాలకు అ పడతాయి. ఆయన కథల్లో కనిపించే పాత్రలు, వాటి వ్యవహార చిత్రణ కూడా సజీవంగా ఉంటుంది. “కండీషన్స్ అప్లయ్" సంపుటిలోని కథలన్నీ ఇదే కోవలో సాగుతాయి. అంతేకాదు - వీటిని చదువుతుంటే మందిని వెంటేసుకుని సాగే దండోరా కళ్లకు కడుతుంది. ప్రశ్నల జెండాలు చేబట్టి నిలబడిన వాడల్లోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. పాఠకులను మెస్మరైజ్ చేసే నెరేటివ్ స్టయిల్ పసునూరి కలానికి ఉన్న మరో బలం. ప్రామాణిక భాష సహా వాడకట్టులోని సొంపైన నుడికారంపై తనకున్న పట్టు అపారం. ఈ రెండు కారణాల రీత్యా తెలంగాణ డైలెక్ట్, దళిత ఈస్తటిక్కి రవీందర్ కథలు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. రచయితకున్న విశాలమైన సామాజిక అవగాహన, నిశిత పరిశీలన, చారిత్రిక దృక్కోణం, బలమైన తాత్విక పునాది వంటి నాలుగు అంశాలు కూడా ఈ కథల పరిపుష్టికి దోహదపడిన జీవధాతువులు. కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం అందుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి రచయిత డాక్టర్ పసునూరి రవీందర్. వర్తమాన యువ రచయితల్లో.................© 2017,www.logili.com All Rights Reserved.