డా. ముదిగొండ వీరభద్రయ్య ఇంతకుముందు 60 సాహిత్య ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రను 2007 లో శ్రీ రమణాశ్రమంలో ఉండి రచించారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జ్ఞాన మననము, ఆత్మ శాస్త్రము, శ్రీ సత్యసాయి బోధనలు నేపథ్యంలో 'అద్వైత జ్ఞాన ప్రకాశిక' అన్న తత్త్వగ్రంథాలను (అన్నింటిని సత్యసాయి బుక్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం ప్రచురించింది), భగవాన్ శ్రీ సత్యసాయి జీవిత మకరందం (బ్రౌన్ అకాడమీ ప్రచరణ) గ్రంథాన్నీ రచించారు.
ఇప్పుడు ఈ "నేనెవరు - శ్రీ రమణీయం" అన్న గ్రంథాన్ని రచించి భగవాన్ రమణుల మార్గాన్ని మననం చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులోని వ్యాసాలు ఆంధ్రభూమి దినపత్రిక కోసం రచించినవి.
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్ష పదవి నుంచి 2004 లో విరమించాక ప్రస్తుతం వీరు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ అఫ్ హయ్యర్ లెర్నింగ్ లో గౌరవ ఆచార్యులుగా సేవలు అందిస్తున్నారు.
- ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య