తెలుగులో క్రాస్ వర్డు పజిల్లు ఎప్పటినుండో ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగులో మొట్టమొదటి క్రాస్ వర్డ్ పజిల్ ని తొలి తెలుగు అపరాధ పరిశోధక నవలా రచయిత శ్రీ దేవరాజు వెంకట కృష్ణరావుగారు 1937లో తాను ఆరంభించిన ‘పద సమస్య బోధిని’ మాసపత్రికలో ప్రవేశపెట్టారని ఆంద్రభారతివారు రాశారు. తదుపరి కాలంలో వీటిని రకరకాల పేర్లతో అనేక పత్రికలు నిర్వహిస్తున్నాయి. గడి – నుడి, పదచంద్రిక, పదప్రహేళిక, పదవినోదం, పదరంగం, పదచదరంగం, పదరసం, పదశోధన, పదబంధం, పదనిసలు, సండే పజిల్, మాటలకొలువు, పద్మవ్యూహం, పజిలింగ్ పజిల్, పదక్రీడ, పదవిన్యాసం, పదప్రజ్ఞ, పదగారడి, పదకేళి.. ఇలా అనేక పేర్లతో తెలుగువాళ్లకి అత్యంత ప్రీతికరమైన గడినుడిని అనేక పత్రికలూ కొనసాగిస్తూ తెలుగు పాఠకులకి వినోదాన్ని, విజ్ఞాన్ని అందిస్తున్నాయి.