నాకు సినిమా జర్నలిజానికి సంబంధించి సుమారు 45 ఏళ్ళు పూర్తియిపోయాయి. 1970 నుండి వ్రాయటం మొదలెట్టాను. ఇంకా రాస్తూనే ఉన్నాను. ఈ రాయటంలో ఎందరో మహానుభావులు ఎదురయ్యారు. ఎన్నో ముచ్చట్లు, ఎన్నో సంగతులు, వారితో ఇంటర్వ్యూలు ... మాట మంతి, ఇవన్నీ వేరు వేరు అంశాలు. ఒకదానికొకటి సంబంధం లేనటువంటివి. మనం కావాలని ఒక పేపర్ కో , మ్యాగజిన్ కో ప్రశ్నరూపంగా అడిగితే ఎదుటి వ్యక్తి జవాబు ఇచ్చేవి ఇంటర్వ్యూలు. ఎదుటి వ్యక్తి ఎక్కడైనా కనపడితే అక్కడిక్కడే సరదాగా ముచ్చటించే ముచ్చట్లు వేరుగా ఉంటాయి. ఎక్కడైనా కూర్చుంటే సరదాగా మాట్లాడుకునే మాటామంతి! ఈ మాటా మంతిలో ఎదుటి వ్యక్తి మనం సరదాగా మాట్లాడుకోవడం ఉంటుంది. ఈ ఫార్మాట్లు అన్ని కలిపి నా బయోగ్రఫీగా ఒక పుస్తకం తీసుకురావాలన్నది నాకున్న కోరిక.