మన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం అంత తేలికకాదు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలతో సుసంపన్నమైన సాహిత్యం మనది. ఈ మొత్తం సాహిత్యాన్ని వైదికమూ, లౌకికమూ అని విభాగం చేస్తారు. అయితే వైదిక సాహిత్యంలో అద్భుతమైన కవితావాక్యాలున్నట్లే, లౌకిక కావ్యాల్లోనూ అంతర్గర్భితంగా, మార్మికంగా తాత్త్విక విషయాలుంటాయి. అంటే వీటిలో అర్థం వేరు వేరు సర్తాల్లో ఉంటుంది.
వేదాలను ప్రభుసమ్మితాలనీ, పురాణాలను మిత్రసమ్మితాలనీ, కావ్యాలను కాంతాసమ్మితాలనీ, అంటారు. అంటే వీటన్నిటికీ ప్రయోజనం ఒక్కటే కాని అవి బోధించే పద్ధతిలోనే భేదం ఉంటుందని. వేదాలలో చెప్పే విషయం సామాన్యులు అర్థం చేసుకోలేరనే భావనతో పురాణాలు అదే విషయాన్ని కథల రూపంలో చెప్తాయి. అంటే అర్థం చేసుకోగలిగిన పాఠకుడి స్థాయిని బట్టి భేదం ఏర్పడుతుంది. అందుకే ప్రాచీన సాహిత్యంలో అధికారి నిర్ణయం చేస్తారు. ఆ రచనను అర్థం చేసికోవడానికి యోగ్యత ఉన్న వాడెవరు అని. అంటే ఎవరికోసం ఆ రచనను ఉద్దేశించారు అని.
- కుప్పా వేంకట కృష్ణమూర్తి