రాయలసీమలో పంట పొలాలు నిరంతరం కరువుతో ఊషర క్షేత్రంగా మారినా రాసాని పంటపొలం మాత్రం నిత్యం సస్యశ్యామలమై కళకళలాడుతూ పసిడి కావ్య పంటల్ని తెలుగు లోగిళ్ళలో కుప్ప పోయడం అందరూ గుర్తించదగిన అంశం. సామాజిక అధ్యయనంలో తాను గుర్తించిన సామాజికాంశాలను, ముఖ్యంగా రచయితలెవరూ స్పృశించని, గుర్తించని జీవితాల్లోని చీకటి కోణాలను కథలుగా మలచడంలో రాసాని వికాసమూ తెలుస్తాయి.
ప్రపంచీకరణ బ్రహ్మరాక్షసి ఉక్కు పాదాల కింద చిద్రమైపోతున్న కులవృత్తి పరుల జీవితాలను ఆదుకోవాలన్న తపన వ్యక్తమవుతుంది. మారుమూల పల్లెలో మూఢ ఆచారాల ముసుగుతో అగ్రవర్ణ భూస్వాములు తమ 'బులపాటం' తీర్చుకోవడానికి కాపాడుతున్న 'బసివిని' వంటి హీనమయిన పద్ధతుల నుండి బాధితులు బయటపడాలన్న కాహితన్య ప్రబోధం ఈ కథల్లో వినిపిస్తుంది. మనుషుల్లో నుంచి పారిపోతున్న మనిషితనాన్ని రక్షించుకోవలసిన అవసరాన్ని ఈ కథలు సూచిస్తాయి.
- డా శాంతి నారాయణ
రాయలసీమలో పంట పొలాలు నిరంతరం కరువుతో ఊషర క్షేత్రంగా మారినా రాసాని పంటపొలం మాత్రం నిత్యం సస్యశ్యామలమై కళకళలాడుతూ పసిడి కావ్య పంటల్ని తెలుగు లోగిళ్ళలో కుప్ప పోయడం అందరూ గుర్తించదగిన అంశం. సామాజిక అధ్యయనంలో తాను గుర్తించిన సామాజికాంశాలను, ముఖ్యంగా రచయితలెవరూ స్పృశించని, గుర్తించని జీవితాల్లోని చీకటి కోణాలను కథలుగా మలచడంలో రాసాని వికాసమూ తెలుస్తాయి. ప్రపంచీకరణ బ్రహ్మరాక్షసి ఉక్కు పాదాల కింద చిద్రమైపోతున్న కులవృత్తి పరుల జీవితాలను ఆదుకోవాలన్న తపన వ్యక్తమవుతుంది. మారుమూల పల్లెలో మూఢ ఆచారాల ముసుగుతో అగ్రవర్ణ భూస్వాములు తమ 'బులపాటం' తీర్చుకోవడానికి కాపాడుతున్న 'బసివిని' వంటి హీనమయిన పద్ధతుల నుండి బాధితులు బయటపడాలన్న కాహితన్య ప్రబోధం ఈ కథల్లో వినిపిస్తుంది. మనుషుల్లో నుంచి పారిపోతున్న మనిషితనాన్ని రక్షించుకోవలసిన అవసరాన్ని ఈ కథలు సూచిస్తాయి. - డా శాంతి నారాయణ© 2017,www.logili.com All Rights Reserved.