ఈ నాటకం పై పై చూపులకు వుత్తుత్తి మెరుపుల్లా కనిపించినప్పటికీ (వైల్డ్ స్వయంగా దీన్ని 'సీతాకోక చిలుకల కోసం ఒక సీతాకోక చిలుక రాసిన' నాటకం అన్నాడు) ఇందులో సీరియస్ విషయాలున్నాయని, నాన్సెన్స్ ముసుగులో రచయిత సీరియస్ విషయాలు మాట్లాడాడని నొక్కి చెప్పిన విమర్శకులున్నారు. ఈ దృక్పథం ప్రకారం, వైల్డ్ సత్యం చెప్పి నవ్వించాడు. పిల్లచేష్టల రూపంలో సీరియస్ వ్యంగ్యం రాశాడు. పెళ్లి, డబ్బు, విద్య, నిజాయితీ (సత్యం రమణీయంగా ఉండడం లేదా ఉండకపోవడం), వర్గ సంబంధాలు, మరణం... ఎన్నెన్నో జీవన సమస్యలను స్పృశించాడు. పాఠకులు ఈ నాటకాన్ని రెండు రకాలుగా చూడొచ్చు.
జీవన వాస్తవికతను తిలోదకాలిచ్చిన కళారూపంగా, జేవితం మీద పరోక్షంగా వ్యాఖ్యానించే కళారూపంగా.. రెండు విధాలుగానూ నాటకాన్ని పరిశీలించి, తమకు తాము ఒక అభిప్రాయానికి రావచ్చు. బహుశా, నాటకంలో సుబ్బారావు అన్నట్లు 'సత్యం ఎప్పుడూ అంత సాదాసీదాగా ఉండదు. అది పరిశుద్ధంగా ఉండడం కూడా అరుదే.
ఈ నాటకం పై పై చూపులకు వుత్తుత్తి మెరుపుల్లా కనిపించినప్పటికీ (వైల్డ్ స్వయంగా దీన్ని 'సీతాకోక చిలుకల కోసం ఒక సీతాకోక చిలుక రాసిన' నాటకం అన్నాడు) ఇందులో సీరియస్ విషయాలున్నాయని, నాన్సెన్స్ ముసుగులో రచయిత సీరియస్ విషయాలు మాట్లాడాడని నొక్కి చెప్పిన విమర్శకులున్నారు. ఈ దృక్పథం ప్రకారం, వైల్డ్ సత్యం చెప్పి నవ్వించాడు. పిల్లచేష్టల రూపంలో సీరియస్ వ్యంగ్యం రాశాడు. పెళ్లి, డబ్బు, విద్య, నిజాయితీ (సత్యం రమణీయంగా ఉండడం లేదా ఉండకపోవడం), వర్గ సంబంధాలు, మరణం... ఎన్నెన్నో జీవన సమస్యలను స్పృశించాడు. పాఠకులు ఈ నాటకాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. జీవన వాస్తవికతను తిలోదకాలిచ్చిన కళారూపంగా, జేవితం మీద పరోక్షంగా వ్యాఖ్యానించే కళారూపంగా.. రెండు విధాలుగానూ నాటకాన్ని పరిశీలించి, తమకు తాము ఒక అభిప్రాయానికి రావచ్చు. బహుశా, నాటకంలో సుబ్బారావు అన్నట్లు 'సత్యం ఎప్పుడూ అంత సాదాసీదాగా ఉండదు. అది పరిశుద్ధంగా ఉండడం కూడా అరుదే.© 2017,www.logili.com All Rights Reserved.