నిజానికి ఐదేండ్ల కంటే ఎక్కువేనేమో. ఫేస్ బుక్ తో పరిచయం అయినప్పటినుంచి తరచూ ఎంతో కొంత కాలం దాంతో గడుపుతున్నాను. నా ఒంటరితనం నాకు మామూలు గానే దుర్భరం. పడుగురున్న చోట కూడా ఒంటరిని. అలాంటిది గత ఐదేండ్లుగా ఎక్కువగా నాతో నేనే ఉండాల్సి వచ్చింది. రాను రాను ఫేస్ బుక్ నా ముఖ్య కంపానియన్ అయిపోయింది. దీన్ని సక్రమంగానే ఉపయోగించుకున్నాను. అంతకు ముందెప్పటి నుంచో నాకు డైరీ రాసే అలవాటు ఉండింది. ఏ కాలేజీ రోజులునుంచో. నా డైరీ నిజంగా డైరీనే. టూ పర్సనల్. భయంకరం. ఫేస్ బుక్ లో రాస్తున్నప్పుడు కూడా డైరీ రాస్తున్న ఫీలింగే కలిగేది. డైరీ రాస్తున్నప్పుడు దీన్ని ఎవరైనా ఎప్పుడైనా చదవచ్చు అనే భయోహ గిలిగింతలు పెట్టేది.
ఎవరూ చూడరనే భరోసా ఉండేది. ఫేస్ బుక్ లో రాస్తున్నప్పుడు డైరీ రాస్తున్నప్పటి ఫీలింగ్ తో పాటు, దీన్ని ఇతర్లు చూస్తారు అనే ఊహ మరింత గిలిగింతలు పెట్టేది. కాకపొతే అచ్చు కోసం వ్యాసం రాస్తున్నట్టు అనిపించేది కాదు. రాసి, ఫేస్ బుక్ లో పోస్టు చేసిన దాన్ని కావాలంటే మార్చుకోవచ్చు, తీసెయ్యొచ్చు అని ఒక ధైర్యం. ఈలోగా ఒకసారి చూసిన వాళ్ళు కూడా, వెంటనే తీసేయబడిన దాన్ని పెద్దగా పట్టించుకోరు. తానే తప్పనుకున్నాడులే, పోనీ అనుకుంటారనుకుంటా. ఒకేసారి అచ్చుకోసం రాస్తున్నట్టు, డైరీ రాస్తున్నట్టు చిత్రమైన బేఫికర్ మనస్తత్వానికి లోనయ్యే వాడిని.. ఫేస్ బుక్ లో. ఇదొక ఓపెన్ డైరీ.
- హెచ్చార్కె
నిజానికి ఐదేండ్ల కంటే ఎక్కువేనేమో. ఫేస్ బుక్ తో పరిచయం అయినప్పటినుంచి తరచూ ఎంతో కొంత కాలం దాంతో గడుపుతున్నాను. నా ఒంటరితనం నాకు మామూలు గానే దుర్భరం. పడుగురున్న చోట కూడా ఒంటరిని. అలాంటిది గత ఐదేండ్లుగా ఎక్కువగా నాతో నేనే ఉండాల్సి వచ్చింది. రాను రాను ఫేస్ బుక్ నా ముఖ్య కంపానియన్ అయిపోయింది. దీన్ని సక్రమంగానే ఉపయోగించుకున్నాను. అంతకు ముందెప్పటి నుంచో నాకు డైరీ రాసే అలవాటు ఉండింది. ఏ కాలేజీ రోజులునుంచో. నా డైరీ నిజంగా డైరీనే. టూ పర్సనల్. భయంకరం. ఫేస్ బుక్ లో రాస్తున్నప్పుడు కూడా డైరీ రాస్తున్న ఫీలింగే కలిగేది. డైరీ రాస్తున్నప్పుడు దీన్ని ఎవరైనా ఎప్పుడైనా చదవచ్చు అనే భయోహ గిలిగింతలు పెట్టేది. ఎవరూ చూడరనే భరోసా ఉండేది. ఫేస్ బుక్ లో రాస్తున్నప్పుడు డైరీ రాస్తున్నప్పటి ఫీలింగ్ తో పాటు, దీన్ని ఇతర్లు చూస్తారు అనే ఊహ మరింత గిలిగింతలు పెట్టేది. కాకపొతే అచ్చు కోసం వ్యాసం రాస్తున్నట్టు అనిపించేది కాదు. రాసి, ఫేస్ బుక్ లో పోస్టు చేసిన దాన్ని కావాలంటే మార్చుకోవచ్చు, తీసెయ్యొచ్చు అని ఒక ధైర్యం. ఈలోగా ఒకసారి చూసిన వాళ్ళు కూడా, వెంటనే తీసేయబడిన దాన్ని పెద్దగా పట్టించుకోరు. తానే తప్పనుకున్నాడులే, పోనీ అనుకుంటారనుకుంటా. ఒకేసారి అచ్చుకోసం రాస్తున్నట్టు, డైరీ రాస్తున్నట్టు చిత్రమైన బేఫికర్ మనస్తత్వానికి లోనయ్యే వాడిని.. ఫేస్ బుక్ లో. ఇదొక ఓపెన్ డైరీ. - హెచ్చార్కె© 2017,www.logili.com All Rights Reserved.