జెండర్ - కులం... విడివిడిగా కనబడే ఈ రెండు అంశాల నడుమనున్న సంబంధం విడదీయరానిది. కులవ్యవస్థ బలపడుతున్న క్రమంలోనే స్త్రీలపై జెండర్ పరమైన వివక్ష, అణచివేత పెరుగుతూ వచ్చింది. వ్యక్తిగత ఆస్తి, కులవ్యవస్థ కలిసి కుటుంబ నిర్మాణాలను స్త్రీలపాలిటి నిర్బంధ శిబిరాలుగా మార్చాయి. ఆస్తినీ, సామాజిక హోదానూ ఆధిపత్య కులాలకు వంశపారంపర్యంగా అందించటానికి ఆ కులాల స్త్రీలను సాధనాలుగా మార్చింది బ్రాహ్మణీయ వ్యవస్థ. మరొక వైపున తరతరాల సామాజిక బానిసత్వాన్నీ, భౌతిక శ్రమనూ నిరంతరంగా మోసుకుపోయే పనిముట్లుగా మారారు పీడిత కులాల స్త్రీలు.
శ్రామికుల నడుమ విభజన రేఖలు గీసి అంతరాలు సృష్టించిన బ్రాహ్మణీయ వ్యవస్థే స్త్రీలను కూడా కులాల పేరిట విడదీసి పరస్పర వైరుధ్యాల్లోకి నెట్టింది. భారతదేశంలోని శ్రామికోద్యమాన్నీ, స్త్రీల సంఘటిత పోరాటాన్నీ కూడా బలహీనపరుస్తున్న ఈ పరిణామాలను చారిత్రిక ఆధారాలతో సవివరంగా చర్చించారు ఉమా చక్రవర్తి. కులానికీ, జెండర్ కూ మధ్యనున్న పరస్పర సంబంధాన్ని బట్టబయలు చేస్తూ స్త్రీలందరి నడుమ ఐక్యత కొరకు స్త్రీవాద దృక్పథంతో కొన్ని విలువైన ప్రతిపాదనలను అందించే రచన ఇది.
జెండర్ - కులం... విడివిడిగా కనబడే ఈ రెండు అంశాల నడుమనున్న సంబంధం విడదీయరానిది. కులవ్యవస్థ బలపడుతున్న క్రమంలోనే స్త్రీలపై జెండర్ పరమైన వివక్ష, అణచివేత పెరుగుతూ వచ్చింది. వ్యక్తిగత ఆస్తి, కులవ్యవస్థ కలిసి కుటుంబ నిర్మాణాలను స్త్రీలపాలిటి నిర్బంధ శిబిరాలుగా మార్చాయి. ఆస్తినీ, సామాజిక హోదానూ ఆధిపత్య కులాలకు వంశపారంపర్యంగా అందించటానికి ఆ కులాల స్త్రీలను సాధనాలుగా మార్చింది బ్రాహ్మణీయ వ్యవస్థ. మరొక వైపున తరతరాల సామాజిక బానిసత్వాన్నీ, భౌతిక శ్రమనూ నిరంతరంగా మోసుకుపోయే పనిముట్లుగా మారారు పీడిత కులాల స్త్రీలు. శ్రామికుల నడుమ విభజన రేఖలు గీసి అంతరాలు సృష్టించిన బ్రాహ్మణీయ వ్యవస్థే స్త్రీలను కూడా కులాల పేరిట విడదీసి పరస్పర వైరుధ్యాల్లోకి నెట్టింది. భారతదేశంలోని శ్రామికోద్యమాన్నీ, స్త్రీల సంఘటిత పోరాటాన్నీ కూడా బలహీనపరుస్తున్న ఈ పరిణామాలను చారిత్రిక ఆధారాలతో సవివరంగా చర్చించారు ఉమా చక్రవర్తి. కులానికీ, జెండర్ కూ మధ్యనున్న పరస్పర సంబంధాన్ని బట్టబయలు చేస్తూ స్త్రీలందరి నడుమ ఐక్యత కొరకు స్త్రీవాద దృక్పథంతో కొన్ని విలువైన ప్రతిపాదనలను అందించే రచన ఇది.© 2017,www.logili.com All Rights Reserved.