మనం మానవమాత్రులం మానవదేహానికి సందేహాలు బహుళం సందేహనివృత్తి సర్వమానవ ప్రవృత్తి వచనంలో రచనంలో పలుమార్లు పొడసూపే సందేహాలకు సమాధానాలు వెదికేసందర్భంలో ఆ కాలంలో లాగా అనేకకోశవ్యాకరణాది గ్రంథాలు దగ్గర పెట్టుకొని వెదికే తీరిక, ఓపిక లేని ఈ కాలంలో ఇంటా బయటా, ఎక్కడైనా ఎప్పుడైనా నలుగురిలో నవ్వులపాలు కాకుండా కొంతవరకైనా మన భాషను మనం సరిదిద్దుకొంటూ భాషాసంపన్నత సాధించే సదాశయంతో విద్యార్థులకైనా, అధ్యాపకులకైనా,మాధ్యమాలవారికైనా,ఆసక్తుల కెవరికైనా రాతబల్లపై ఉంచుకొని తక్షణం సందేహనివృత్తి చేసుకొనే విధంగా సూక్ష్మంలో మోక్షంలా, రెడీ రెకనార్ లా అన్నీ కాకున్నా కొన్నిటినైనా నిత్యవ్యవహారంలో ఉండే మాటల్ని ఒకచోట చేర్చి, ఒక సంకలనం చేస్తే ఆ కనీసప్రయత్నం సంకల్పానికి సమ్యక్కల్పనం.
తప్పొప్పుల కోశసం
కలుపు మొక్కల దొలగించి, బలము నిచ్చి,
మంచి మొక్కల మించుగ బెంచు నట్లు
తప్పుమాటల నెడలింప, నొప్పు లెఱుగ
తెలుగు నేలపై నంతట - తేజరిల్లు!
నీట గలిసిన పాలను నేర్పు మీఱ
హంస యేరీతి వేఱు సేయంగ నేర్చు
తప్పు లెడలించి, యొప్పుల జెప్పగల్గ
తెలుగు - నేలపై నంతట తేజరిల్లు!
© 2017,www.logili.com All Rights Reserved.