ఊరుగాలి కానరాని పిలుపేదో మోసుకువచ్చినట్లు, ఇన్నేళ్లు వెదుకుతున్న తీగ కాలికి తగిలినట్లు అనిపించి తన స్వంతూరికి పయనమయ్యాడు. తిరుపతినుండీ రైలులోబయల్దేరిన వొసికేరి కిటికీలోనుండీ బయటికి చూస్తూ తన బాల్యస్మృతుల సంచిలో చెయిపెట్టి తడిమాడు.
ఉద్యోగమొచ్చినప్పుడు విడిచిపెట్టిన వూరు, మధ్యలో ఎప్పుడో కొత్తలో పెళ్లయినప్పుడు ఒక్కసారి ఆచారం ప్రకారం వెళ్ళొచ్చినట్లు గుర్తు. అంతే పూరితోగాని, కుటుంబానితోగాని అంతగా సంబంధాలు జరిపినట్లు దాఖలాలులేవు.
అనంతపురం జిల్లాలో రికార్డుల్లో ఎక్కడో అడుగున పడినవూరు గొందిపల్లి. రికార్డుల్లోనే కాదు అభివృద్ధిలోను వాడుకలోకూడా అట్టడుగున వుంటుంది. వూరుచుట్టూ కొండలు, గుట్టలు, వంకలు, ఆ వంకల్లో ఈతచెట్లు, లోయలు, నిర్మానుష్యంగా వుంటుంది చుట్టూవాతావరణం. వూర్లోకి వచ్చేదాకా తెలీదు అక్కడొక పూరుందని. ఆ పూరితో అవసరం, సంబంధంవున్నోళ్లు తప్పితే వయా ఆ వూరిమీద పోవడానికి అవకాశమేలేదు.
వందకుపైగా కుటుంబాలుంటాయి. వూర్లో చాలావరకూ గొర్లుకాసేకురుబవాళ్లే, వీళ్లతో సమానంగా బోయకులస్థులు, మాదిగలుంటారు, కోమట్లు రెండిండ్లు ఎప్పుడో వుండేవాళ్లంట, ఇంక వేరే కులాలులేవు. భూములున్నోళ్లు చెరువుకింద పంటపండించుకుంటారు, మరికొంతమంది కూలీలుగా పనిచేస్తుంటారు. ముష్టికోవెల చెరువే వాళ్లకి ప్రధాన జీవనాధారం.
పూరిపరిసరాలంతా కొండలు, గుట్టలే, ఆచుట్టుపక్కల కొండల్లో, గుట్టల్లో ఎక్కడ చినుకుపడినా నేరుగా వచ్చిముష్టికోవెలచెరువులో చేరాల్సిందే అలావుంది...................
బీరప్ప “చారిత్రక, సాంస్కృతిక వీరుడు” ఊరుగాలి కానరాని పిలుపేదో మోసుకువచ్చినట్లు, ఇన్నేళ్లు వెదుకుతున్న తీగ కాలికి తగిలినట్లు అనిపించి తన స్వంతూరికి పయనమయ్యాడు. తిరుపతినుండీ రైలులోబయల్దేరిన వొసికేరి కిటికీలోనుండీ బయటికి చూస్తూ తన బాల్యస్మృతుల సంచిలో చెయిపెట్టి తడిమాడు. ఉద్యోగమొచ్చినప్పుడు విడిచిపెట్టిన వూరు, మధ్యలో ఎప్పుడో కొత్తలో పెళ్లయినప్పుడు ఒక్కసారి ఆచారం ప్రకారం వెళ్ళొచ్చినట్లు గుర్తు. అంతే పూరితోగాని, కుటుంబానితోగాని అంతగా సంబంధాలు జరిపినట్లు దాఖలాలులేవు. అనంతపురం జిల్లాలో రికార్డుల్లో ఎక్కడో అడుగున పడినవూరు గొందిపల్లి. రికార్డుల్లోనే కాదు అభివృద్ధిలోను వాడుకలోకూడా అట్టడుగున వుంటుంది. వూరుచుట్టూ కొండలు, గుట్టలు, వంకలు, ఆ వంకల్లో ఈతచెట్లు, లోయలు, నిర్మానుష్యంగా వుంటుంది చుట్టూవాతావరణం. వూర్లోకి వచ్చేదాకా తెలీదు అక్కడొక పూరుందని. ఆ పూరితో అవసరం, సంబంధంవున్నోళ్లు తప్పితే వయా ఆ వూరిమీద పోవడానికి అవకాశమేలేదు. వందకుపైగా కుటుంబాలుంటాయి. వూర్లో చాలావరకూ గొర్లుకాసేకురుబవాళ్లే, వీళ్లతో సమానంగా బోయకులస్థులు, మాదిగలుంటారు, కోమట్లు రెండిండ్లు ఎప్పుడో వుండేవాళ్లంట, ఇంక వేరే కులాలులేవు. భూములున్నోళ్లు చెరువుకింద పంటపండించుకుంటారు, మరికొంతమంది కూలీలుగా పనిచేస్తుంటారు. ముష్టికోవెల చెరువే వాళ్లకి ప్రధాన జీవనాధారం. పూరిపరిసరాలంతా కొండలు, గుట్టలే, ఆచుట్టుపక్కల కొండల్లో, గుట్టల్లో ఎక్కడ చినుకుపడినా నేరుగా వచ్చిముష్టికోవెలచెరువులో చేరాల్సిందే అలావుంది...................© 2017,www.logili.com All Rights Reserved.