ప్రాచీన కాలం నుండి సమాజంలో కనిపించే దుర్లక్షణాలను విమర్శిస్తూ రచనలు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంబంధమైన లోపాలను ఎత్తి చూపి సంస్కరణకు పూనుకుంటాయి. ఇటువంటి రచనలు సాహిత్య లక్షణంతో కూడుకున్నప్పుడు విస్తృతమైన జనాదరణ పొందుతాయి. వదరుబోతు వ్యాసాలు సమాజంలోని సాంఘిక, సాంస్కృతిక విషయాలపై విమర్శ వ్యాసాలు.
ఇంగ్లీషులోని స్పెక్టేటర్, టాట్లర్ వ్యాసాల ఒరవడిలో తెలుగులో సాక్షి, వదరుబోతు వ్యాసాలు వచ్చాయి. వీటి సాహిత్య లక్షణం వల్ల శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆనాటి విమర్శనీయ లక్షణాలు నేటికీ కొనసాగుతూ ఉండవచ్చు. మరికొన్ని కొత్త లక్షణాలు చేరి కూడా ఉండవచ్చు. ఎప్పటికప్పుడు ఇటువంటి లక్షణాలను ఎండగట్టడంలో ఈ వ్యాసాలు ఉపయోగపడతాయి. అనంతర కాలపు రచయితలకు స్పూర్తినిస్తాయి.
సద్విమర్శను కూడా భరించే ఓపిక లేని, దాన్ని కూడా దూషణగానే భావించి దాడికి దిగుతున్న వారెక్కువైన ఈ రోజుల్లో విమర్శ సున్నితమయినా, కఠోరమయినా అది వ్యక్తిగత, సంఘగత దుర్లక్షణాలను పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుందని గ్రహించవలసిన అవసరం ఉందని ఈ వ్యాసాలు గుర్తు చేస్తాయి. ఇటువంటి గ్రంథాల ప్రయోజనమదే. వదరుబోతునూ, దీనితోపాటు సాక్షినీ మళ్ళీ మళ్ళీ చదివి సాహిత్యానందంతో పాటు ఇటువంటి రచనల ప్రయోజనాన్నీ, ఆవశ్యకతనూ పాఠకులు గ్రహిస్తారని మా ఆశ.
ప్రాచీన కాలం నుండి సమాజంలో కనిపించే దుర్లక్షణాలను విమర్శిస్తూ రచనలు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంబంధమైన లోపాలను ఎత్తి చూపి సంస్కరణకు పూనుకుంటాయి. ఇటువంటి రచనలు సాహిత్య లక్షణంతో కూడుకున్నప్పుడు విస్తృతమైన జనాదరణ పొందుతాయి. వదరుబోతు వ్యాసాలు సమాజంలోని సాంఘిక, సాంస్కృతిక విషయాలపై విమర్శ వ్యాసాలు. ఇంగ్లీషులోని స్పెక్టేటర్, టాట్లర్ వ్యాసాల ఒరవడిలో తెలుగులో సాక్షి, వదరుబోతు వ్యాసాలు వచ్చాయి. వీటి సాహిత్య లక్షణం వల్ల శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆనాటి విమర్శనీయ లక్షణాలు నేటికీ కొనసాగుతూ ఉండవచ్చు. మరికొన్ని కొత్త లక్షణాలు చేరి కూడా ఉండవచ్చు. ఎప్పటికప్పుడు ఇటువంటి లక్షణాలను ఎండగట్టడంలో ఈ వ్యాసాలు ఉపయోగపడతాయి. అనంతర కాలపు రచయితలకు స్పూర్తినిస్తాయి. సద్విమర్శను కూడా భరించే ఓపిక లేని, దాన్ని కూడా దూషణగానే భావించి దాడికి దిగుతున్న వారెక్కువైన ఈ రోజుల్లో విమర్శ సున్నితమయినా, కఠోరమయినా అది వ్యక్తిగత, సంఘగత దుర్లక్షణాలను పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుందని గ్రహించవలసిన అవసరం ఉందని ఈ వ్యాసాలు గుర్తు చేస్తాయి. ఇటువంటి గ్రంథాల ప్రయోజనమదే. వదరుబోతునూ, దీనితోపాటు సాక్షినీ మళ్ళీ మళ్ళీ చదివి సాహిత్యానందంతో పాటు ఇటువంటి రచనల ప్రయోజనాన్నీ, ఆవశ్యకతనూ పాఠకులు గ్రహిస్తారని మా ఆశ.© 2017,www.logili.com All Rights Reserved.