రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు వీణ శేషన్న, నిదారం కృష్ణప్ప, మైసూరు వాసుదేవాచార్యుల్లాంటి హేమాహేమీ సంగీత విద్వాంసుల కచీరీలెన్నో విన్నవాళ్ళు. పైగా వాళ్ళ సన్నిహిత పరిచయం వల్ల సంగీత సాహిత్యాల్లో సదభిరుచిని, సహ్రుదయతను, సంస్కారాన్ని వికసింప చేసుకున్న మహనీయులు. సంగీత సాహిత్యాల్లో దురభిమానానికీ, ఈర్ష్యా ద్వేషాలకూ, స్వార్థానికీ తావివ్వని రుషి కాల్పులు. సంగీత సాహిత్యాలకు సంబంధించిన విషయాలపై తమ అభిప్రాయాల్ని స్పష్టంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పిన వినయమోహనులు రాళ్ళపల్లివారు. సాహిత్య సంగీతాలపై శర్మగారు రాసిన ఈ వ్యాసాలు సురభిళ వారసత్వంగా మనకు సంక్రమించడం మనం చేసుకొన్నా పుణ్యం.
వ్యాసం ఎలా రాయాలో, దాని ఆది, మధ్య, అంతాలు ఏ విధంగా ఉండాలో, అసలు ఆశయమేమితో, స్పష్టంగా, సులభంగా అభిప్రాయాలు వెల్లడించాలంటే ఏం చేయాలో, తెలుగు నుడికారం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, దారి చూపేందుకు ఈ 'రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు' మీ ముందుకు రావడం.
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు వీణ శేషన్న, నిదారం కృష్ణప్ప, మైసూరు వాసుదేవాచార్యుల్లాంటి హేమాహేమీ సంగీత విద్వాంసుల కచీరీలెన్నో విన్నవాళ్ళు. పైగా వాళ్ళ సన్నిహిత పరిచయం వల్ల సంగీత సాహిత్యాల్లో సదభిరుచిని, సహ్రుదయతను, సంస్కారాన్ని వికసింప చేసుకున్న మహనీయులు. సంగీత సాహిత్యాల్లో దురభిమానానికీ, ఈర్ష్యా ద్వేషాలకూ, స్వార్థానికీ తావివ్వని రుషి కాల్పులు. సంగీత సాహిత్యాలకు సంబంధించిన విషయాలపై తమ అభిప్రాయాల్ని స్పష్టంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పిన వినయమోహనులు రాళ్ళపల్లివారు. సాహిత్య సంగీతాలపై శర్మగారు రాసిన ఈ వ్యాసాలు సురభిళ వారసత్వంగా మనకు సంక్రమించడం మనం చేసుకొన్నా పుణ్యం. వ్యాసం ఎలా రాయాలో, దాని ఆది, మధ్య, అంతాలు ఏ విధంగా ఉండాలో, అసలు ఆశయమేమితో, స్పష్టంగా, సులభంగా అభిప్రాయాలు వెల్లడించాలంటే ఏం చేయాలో, తెలుగు నుడికారం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, దారి చూపేందుకు ఈ 'రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు' మీ ముందుకు రావడం.© 2017,www.logili.com All Rights Reserved.