వరహాగిరి వెంకటగిరి 1894 వ సంవత్సరం అగస్టు 10వ తేదీన బరంపురంలో జన్మించారు. తల్లి శ్రీమతి సుబ్బమ్మగారు, తండ్రి శ్రీవరహాగిరి వెంకట జోగయ్య పంతులు.
స్థానిక కళ్ళికోట కళాశాలలో గ్రాడ్యుయేషన్ అనంతరం బారిష్టర్ చదవటానికి ఐర్లండ్ వెళ్ళి నేషనల్ యూని వర్సిటీలో ప్రవేశించారు. ఐర్లాండ్ లో ఉన్న భారతీయ విద్యారులతో కలిసి ఒక సంఘాన్ని స్థాపించారు. ఐర్లాండ్లో నాడు సాగుతున్న నిన్-ఫీన్ ఉద్యమంలో పాల్గొనటం బ్రిటిష్ వారికి నచ్చకపోవటంతో ఆయన జూలై 1 వ తేదీ 1916 న భారతదేశం తిరిగివచ్చారు. 1918లో బరంపురంలో న్యాయవాద వృత్తిలో ప్రవేశించి - "హెూమ్ రూల్ లీగ్ స్థాపించి ఆదిశగా పని చేయటం మొదలు పెట్టారు. వలసరాజ్య ప్రతిపత్తిని కోరిన విజ్ఞాపన పత్రం ప్రచారంలోనూ, సంతకాల ఉద్యమంలోనూ పాల్గొన్నారు. వీరి ప్రచారం గంజాం జిల్లా అంతటా సాగింది. 1921లో గాంధీ పిలుపుతో స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న వీరిని ప్రభుత్వం నిర్భంధించింది. ఒక ప్రక్క స్వాతంత్ర్య సమరంలో పాల్గొంటూనే గిరి గారు కార్మికుల సంక్షేమాన్ని గూర్చి ఆలోచించి కార్మికుల హక్కుల కోసం “అఖిల భారత ట్రేడ్ యూనియన్ సంస్థ స్థాపించి కార్మికుల ప్రయోజనాలను సంరక్షించటానికి సమ్మెలు నిర్వహించేవారు. కార్మిక బంధువుగా పేరు పొందారు. “ఇండస్ట్రియల్ రిలేషన్స్”, “ లేబర్ ప్రోబ్లమ్స్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీస్" గ్రంథాలు వ్రాశారు. ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడెరేషన్ వ్యవస్థాపకులలో ఒకరై ప్రధాన కార్యదర్శిగా మరో ఏడేళ్ళు పని చేశారు. 1931లో జెనీవాలో జరిగిన ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్కి భారత దేశపు కార్మిక ప్రతినిధిగా పాల్గొన్నారు..........................
భారతరత్న వరహాగిరి వెంకటగిరి (1894 - 1980) వరహాగిరి వెంకటగిరి 1894 వ సంవత్సరం అగస్టు 10వ తేదీన బరంపురంలో జన్మించారు. తల్లి శ్రీమతి సుబ్బమ్మగారు, తండ్రి శ్రీవరహాగిరి వెంకట జోగయ్య పంతులు. స్థానిక కళ్ళికోట కళాశాలలో గ్రాడ్యుయేషన్ అనంతరం బారిష్టర్ చదవటానికి ఐర్లండ్ వెళ్ళి నేషనల్ యూని వర్సిటీలో ప్రవేశించారు. ఐర్లాండ్ లో ఉన్న భారతీయ విద్యారులతో కలిసి ఒక సంఘాన్ని స్థాపించారు. ఐర్లాండ్లో నాడు సాగుతున్న నిన్-ఫీన్ ఉద్యమంలో పాల్గొనటం బ్రిటిష్ వారికి నచ్చకపోవటంతో ఆయన జూలై 1 వ తేదీ 1916 న భారతదేశం తిరిగివచ్చారు. 1918లో బరంపురంలో న్యాయవాద వృత్తిలో ప్రవేశించి - "హెూమ్ రూల్ లీగ్ స్థాపించి ఆదిశగా పని చేయటం మొదలు పెట్టారు. వలసరాజ్య ప్రతిపత్తిని కోరిన విజ్ఞాపన పత్రం ప్రచారంలోనూ, సంతకాల ఉద్యమంలోనూ పాల్గొన్నారు. వీరి ప్రచారం గంజాం జిల్లా అంతటా సాగింది. 1921లో గాంధీ పిలుపుతో స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న వీరిని ప్రభుత్వం నిర్భంధించింది. ఒక ప్రక్క స్వాతంత్ర్య సమరంలో పాల్గొంటూనే గిరి గారు కార్మికుల సంక్షేమాన్ని గూర్చి ఆలోచించి కార్మికుల హక్కుల కోసం “అఖిల భారత ట్రేడ్ యూనియన్ సంస్థ స్థాపించి కార్మికుల ప్రయోజనాలను సంరక్షించటానికి సమ్మెలు నిర్వహించేవారు. కార్మిక బంధువుగా పేరు పొందారు. “ఇండస్ట్రియల్ రిలేషన్స్”, “ లేబర్ ప్రోబ్లమ్స్ ఇన్ ఇండియన్ ఇండస్ట్రీస్" గ్రంథాలు వ్రాశారు. ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడెరేషన్ వ్యవస్థాపకులలో ఒకరై ప్రధాన కార్యదర్శిగా మరో ఏడేళ్ళు పని చేశారు. 1931లో జెనీవాలో జరిగిన ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్కి భారత దేశపు కార్మిక ప్రతినిధిగా పాల్గొన్నారు..........................© 2017,www.logili.com All Rights Reserved.