"తెలుగు వెలుగు" గా "తెలుగు తేజం" గా ప్రసిద్ధి చెందిన మహనీయులు. మహోన్నత శ్రేణిని అలంకరించిన చిరస్మరణీయులు డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు. తెలంగాణా ప్రాంతం, ఆంద్రరాష్ట్రాల విలీనంతో తెలుగువారి భాషా ప్రయుక్త రాష్ట్ర "ఆంద్రప్రదేశ్" ఆవిర్భవించటానికి కృషి చేసినవారు. విశాలాంధ్ర వాదులలో నాయకాగ్రేసరులలో గణనీయుడు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పూర్వం అప్పటి హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు బూర్గులవారు. ఆంద్రప్రదేశ్ అవతరణతో తానూ తన పదవిని కోల్పోవలసి వస్తుందని స్పష్టంగా తెలుస్తున్నది. అయినా కూడా దానిని లక్ష పెట్టకుండా విశాలాంధ్ర రాష్ట్రం, ఆంద్రప్రదేశ్ ఏర్పడటానికి శాయశక్తులా కృషి చేసి తన త్యాగనిరతిని చాటుకున్నారు. ఆదర్శ ప్రజానాయకుడుగా అందరి మన్ననలను పొందాడు.
"తెలుగు వెలుగు" గా "తెలుగు తేజం" గా ప్రసిద్ధి చెందిన మహనీయులు. మహోన్నత శ్రేణిని అలంకరించిన చిరస్మరణీయులు డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు. తెలంగాణా ప్రాంతం, ఆంద్రరాష్ట్రాల విలీనంతో తెలుగువారి భాషా ప్రయుక్త రాష్ట్ర "ఆంద్రప్రదేశ్" ఆవిర్భవించటానికి కృషి చేసినవారు. విశాలాంధ్ర వాదులలో నాయకాగ్రేసరులలో గణనీయుడు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పూర్వం అప్పటి హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు బూర్గులవారు. ఆంద్రప్రదేశ్ అవతరణతో తానూ తన పదవిని కోల్పోవలసి వస్తుందని స్పష్టంగా తెలుస్తున్నది. అయినా కూడా దానిని లక్ష పెట్టకుండా విశాలాంధ్ర రాష్ట్రం, ఆంద్రప్రదేశ్ ఏర్పడటానికి శాయశక్తులా కృషి చేసి తన త్యాగనిరతిని చాటుకున్నారు. ఆదర్శ ప్రజానాయకుడుగా అందరి మన్ననలను పొందాడు.© 2017,www.logili.com All Rights Reserved.