రాయలసీమ జిల్లాల్లోని ఎర్ర చందనం అడవుల పై దండ యాత్ర జరుగుతూనే ఉంది. ఎప్పటికి ముగుస్తుంది ఈ అరణ్య కాండ? 'ఎర్ర చందనం దుంగలు స్వాధీనం' అనే వార్త దిన పత్రికల్లో ఎప్పుడూ చూసే ఒక సాధారణ దృశ్యం. పట్టుబడిన తమిళ కూలీని మధ్యలో మోకాళ్ళ పైన కూర్చో బెట్టి చుట్టూ పోలీసులు నిల్చున్న ఫోటో వార్త.... అడవిలో ఎర్ర చందనం వుంటున్నంత కాలం ఈ వార్తలు ఉంటాయి. ఎర్ర చందనం ఎంతో చరిత్రను చూసింది. చూస్తోంది. అడవి ఆక్రందన అశ్రుఘోషకు అక్షర రూపమే ఈ పుస్తకం. చరిత్ర ఇలా ఇక్కడ నమోదైంది.
- డా. వేంపల్లి గంగాధర్