స్వాతంత్రం రాగానే పుట్టిన తరం మాది. నిస్వార్ధ రాజకీయ వాతావరణం, ఆవిష్కరింపబడుతున్న హరిత విప్లవం, విస్తరిస్తున విద్యా సంస్థలు, ఆధునిక దేవాలయాలుగా నిర్మితమవుతున్న సాగు నీటి ప్రాజెక్టులు ( నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచంపాడు లాంటివి), ఉత్సాహంగా పనిచేస్తున్న స్థానిక సంస్థలను చూస్తూ ఎన్నో ఆశలతో, మంచి ఆశయాలతో పెరిగాము. గవర్నమెంటు కొలువులో మేము ప్రవేశించినప్పుడు కీర్తిశేషులయిన ఎస్ ఆర్ శంకరన్ లాంటి ఉన్నతాధికారులు మాకు ఆదర్శ ప్రాయలుగా ఉండేవారు. పాలనా యంత్రాంగములో పెద్దగా తల జొప్పించకుండా, నిజాయితీపరులయిన ఐ ఎ ఎస్ అధికారులను తగు మేరకు ప్రోత్సహించే రాజకీయ వ్యవస్థ కూడా అప్పట్లో ఉండేది.
దురదృష్టం కొద్ది, పతనమనేది మా కళ్ళ ముందే మొదలయింది. ఆ పతనానికి అంతమెక్కడో ఆచూకీ పొడగట్టడం లేదు. మా ఆశలను నిరాశలు చేస్తూ క్రొత్త తరం రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి వ్యవస్థలన్నింటిని భ్రష్టు పట్టించారు. సామాజిక స్పృహ, రాజ్యాంగ అవగాహన, నీతి, విలువలు లేని నాయకులు, సామాజిక మూలాలు, స్థానిక సంస్థల అనుభవాలు లేని నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు విద్యాలయాలలో గ్రూపు రాజకీయాలు నడిపిన శక్తులు, వృత్తి రంగాలలో డబ్బు సంపాదించినటువంటి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, డాక్టర్లు రంగ ప్రవేశం చేసి వ్యవస్థలను నిర్వీరం చేయడం మన కళ్ళ ముందే జరిగింది. దీనితో పాటు మరిచిపోయిన రాచరిక వ్యవస్థ వంటి కుటుంబ పాలన మరలా మన ముందు విజ్రుభించింది.
విశృంఖల మయిన అవినీతి, పూర్తి డబ్బుమయమైన రాజకీయాలు, పతనానికి చివరి దశలో ఉన్నటువంటి వ్యవస్థలను చూస్తూ, ప్రజలను మేలుకొల్పే ప్రయత్నంగా మార్పు కోసం చేసిన ప్రయత్నమే ఈ చిన్న ఎజెండా.
స్వాతంత్రం రాగానే పుట్టిన తరం మాది. నిస్వార్ధ రాజకీయ వాతావరణం, ఆవిష్కరింపబడుతున్న హరిత విప్లవం, విస్తరిస్తున విద్యా సంస్థలు, ఆధునిక దేవాలయాలుగా నిర్మితమవుతున్న సాగు నీటి ప్రాజెక్టులు ( నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచంపాడు లాంటివి), ఉత్సాహంగా పనిచేస్తున్న స్థానిక సంస్థలను చూస్తూ ఎన్నో ఆశలతో, మంచి ఆశయాలతో పెరిగాము. గవర్నమెంటు కొలువులో మేము ప్రవేశించినప్పుడు కీర్తిశేషులయిన ఎస్ ఆర్ శంకరన్ లాంటి ఉన్నతాధికారులు మాకు ఆదర్శ ప్రాయలుగా ఉండేవారు. పాలనా యంత్రాంగములో పెద్దగా తల జొప్పించకుండా, నిజాయితీపరులయిన ఐ ఎ ఎస్ అధికారులను తగు మేరకు ప్రోత్సహించే రాజకీయ వ్యవస్థ కూడా అప్పట్లో ఉండేది. దురదృష్టం కొద్ది, పతనమనేది మా కళ్ళ ముందే మొదలయింది. ఆ పతనానికి అంతమెక్కడో ఆచూకీ పొడగట్టడం లేదు. మా ఆశలను నిరాశలు చేస్తూ క్రొత్త తరం రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేసి వ్యవస్థలన్నింటిని భ్రష్టు పట్టించారు. సామాజిక స్పృహ, రాజ్యాంగ అవగాహన, నీతి, విలువలు లేని నాయకులు, సామాజిక మూలాలు, స్థానిక సంస్థల అనుభవాలు లేని నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు విద్యాలయాలలో గ్రూపు రాజకీయాలు నడిపిన శక్తులు, వృత్తి రంగాలలో డబ్బు సంపాదించినటువంటి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, డాక్టర్లు రంగ ప్రవేశం చేసి వ్యవస్థలను నిర్వీరం చేయడం మన కళ్ళ ముందే జరిగింది. దీనితో పాటు మరిచిపోయిన రాచరిక వ్యవస్థ వంటి కుటుంబ పాలన మరలా మన ముందు విజ్రుభించింది. విశృంఖల మయిన అవినీతి, పూర్తి డబ్బుమయమైన రాజకీయాలు, పతనానికి చివరి దశలో ఉన్నటువంటి వ్యవస్థలను చూస్తూ, ప్రజలను మేలుకొల్పే ప్రయత్నంగా మార్పు కోసం చేసిన ప్రయత్నమే ఈ చిన్న ఎజెండా.
© 2017,www.logili.com All Rights Reserved.