మన దేశంలో వీరాధివీరులుగా గణుతికెక్కి చరిత్రలో నిలిచిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులో రాజులూ వున్నారు. వారి అనుచరులై ప్రాణాలొడ్డి చిరస్మరణీయులైన వారూ వున్నారు. చరిత్ర అనేది అనంతం. అది కాలం గడిచే కొలదీ పెరుగుతూనే వుంటుంది. కానీ తరగదు. మనమే చరిత్రను మరచిపోతాము. విస్మరిస్తాము. మనం మరచిపోయినా, ఎవరు విస్మరించినా చెరిగి పోనిది చరిత్ర.
ఆ చరిత్రలో మనకు తెలిసిన వారూ, తెలియనివారూ, చెదిరిన రాళ్ళక్రిందపడి నలిగిపోయిన స్మృతి చిహ్నాలు, వాళ్ళు చేసిన అపురూపకార్యాలు, అనుసరించకూడని విధానాలు... అలా ఏవైనా కూడా చరిత్రలో చోటు చేసుకుంటూనే వుంటాయి. శతాబ్దాల చరిత్రలో ఈ దేశంలోని ఎన్నో ప్రాంతాలను ఎంతో మంది రాజులు ఏలారు. ఎన్నో సాహసకృత్యాలూ, ఎంతో ఐదార్యం, రక్తపాతాలు, నమ్మకద్రోహాలూ, పగలూ, కక్షలూ కార్పణ్యాలు... ఇలా చరిత్రలో ఏ పేజీ తిరగేసినా మనకు కానవస్తాయి. ఒకనాటి తరంలో చరిత్రకు చాలా ప్రాధాన్యత వుండేది. పెద్దలు తమపిల్లలను కూర్చోబెట్టుకొని చరిత్ర సృష్టించిన వ్యక్తుల గురించి, చరిత్రలో నిలిచిపోయిన వారి గురించి కధలు - కధలుగా చెప్పేవారు. అవి వారికి గుర్తుండిపోయేవి.
మన చరిత్రలో ఒక అల్లూరి సీతారామరాజు, ఒక రాజరాజనరేంద్రుడు, ఖడ్గతిక్కన, మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, తాండ్ర పాపారాయుడు... ఇలా ఎంతో మంది వీరులు వున్నారు. వారిలో చాలా మంది గురించి భావితరాలవారికి తెలిసే అవకాశం మృగ్యమైపోతోంది. అందుకే వారిలో కొంతమంది గురించి నేటి యువతకు, గుర్తు చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఈ చిన్ని పుస్తకం వ్రాయడం జరిగింది. ఇదే నేటి పిల్లలకు, యువకులకు కూడా "మన వీరయోధులు" గురించి కొంత సమాచారాన్ని ఇస్తుందన్న ఆశతో...
- బాలు
మన దేశంలో వీరాధివీరులుగా గణుతికెక్కి చరిత్రలో నిలిచిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులో రాజులూ వున్నారు. వారి అనుచరులై ప్రాణాలొడ్డి చిరస్మరణీయులైన వారూ వున్నారు. చరిత్ర అనేది అనంతం. అది కాలం గడిచే కొలదీ పెరుగుతూనే వుంటుంది. కానీ తరగదు. మనమే చరిత్రను మరచిపోతాము. విస్మరిస్తాము. మనం మరచిపోయినా, ఎవరు విస్మరించినా చెరిగి పోనిది చరిత్ర. ఆ చరిత్రలో మనకు తెలిసిన వారూ, తెలియనివారూ, చెదిరిన రాళ్ళక్రిందపడి నలిగిపోయిన స్మృతి చిహ్నాలు, వాళ్ళు చేసిన అపురూపకార్యాలు, అనుసరించకూడని విధానాలు... అలా ఏవైనా కూడా చరిత్రలో చోటు చేసుకుంటూనే వుంటాయి. శతాబ్దాల చరిత్రలో ఈ దేశంలోని ఎన్నో ప్రాంతాలను ఎంతో మంది రాజులు ఏలారు. ఎన్నో సాహసకృత్యాలూ, ఎంతో ఐదార్యం, రక్తపాతాలు, నమ్మకద్రోహాలూ, పగలూ, కక్షలూ కార్పణ్యాలు... ఇలా చరిత్రలో ఏ పేజీ తిరగేసినా మనకు కానవస్తాయి. ఒకనాటి తరంలో చరిత్రకు చాలా ప్రాధాన్యత వుండేది. పెద్దలు తమపిల్లలను కూర్చోబెట్టుకొని చరిత్ర సృష్టించిన వ్యక్తుల గురించి, చరిత్రలో నిలిచిపోయిన వారి గురించి కధలు - కధలుగా చెప్పేవారు. అవి వారికి గుర్తుండిపోయేవి. మన చరిత్రలో ఒక అల్లూరి సీతారామరాజు, ఒక రాజరాజనరేంద్రుడు, ఖడ్గతిక్కన, మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, తాండ్ర పాపారాయుడు... ఇలా ఎంతో మంది వీరులు వున్నారు. వారిలో చాలా మంది గురించి భావితరాలవారికి తెలిసే అవకాశం మృగ్యమైపోతోంది. అందుకే వారిలో కొంతమంది గురించి నేటి యువతకు, గుర్తు చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఈ చిన్ని పుస్తకం వ్రాయడం జరిగింది. ఇదే నేటి పిల్లలకు, యువకులకు కూడా "మన వీరయోధులు" గురించి కొంత సమాచారాన్ని ఇస్తుందన్న ఆశతో... - బాలు© 2017,www.logili.com All Rights Reserved.