సాహిత్యంలో కొద్దిభాగం మాత్రమే వాస్తవికత. ఈ సూత్రం నాటకానికి కూడా వర్తిస్తుంది. అంతమాత్రం చేత కళగా నాటకానికున్న ప్రత్యేక గాంభీర్యాన్ని కాదంటున్నామని భావించకూడదు. నవల కేవలం కల్పనాత్మకమైన వచనం మాత్రమే కాదు. అది మానవ జీవితానికి సంబంధించిన వచనం. మానవుణ్ణి మొత్తంగా తన పరిధిలోకి తీసుకొని, అతన్ని సంపూర్ణంగా చిత్రించటానికి ప్రయత్నించిన మొట్టమొదటి కళారూపం నవల.
మానవుడి రహస్య జీవితాన్ని దృశ్యమానం చేయగలిగిన శక్తి నవలకు ఉంది. సుప్రసిద్ధ రచయితా, విమర్శకుడు ఇ ఎం ఫార్ స్టర్ - నవలకూ, ఇతర కళారూపాలకు ఉన్న తేడా, నవలకున్న ప్రత్యేకతా ఇదేనని చెప్పాడు. కవిత్వం, నాటకం, సినిమా, చిత్రలేఖనం, సంగీతం మొదలైన కళలు చూపించే జీవిత వాస్తవికతకూ, నవల చూపించే జీవిత వాస్తవికతకు చాలా తేడా ఉంటుంది.
సాహిత్యంలో కొద్దిభాగం మాత్రమే వాస్తవికత. ఈ సూత్రం నాటకానికి కూడా వర్తిస్తుంది. అంతమాత్రం చేత కళగా నాటకానికున్న ప్రత్యేక గాంభీర్యాన్ని కాదంటున్నామని భావించకూడదు. నవల కేవలం కల్పనాత్మకమైన వచనం మాత్రమే కాదు. అది మానవ జీవితానికి సంబంధించిన వచనం. మానవుణ్ణి మొత్తంగా తన పరిధిలోకి తీసుకొని, అతన్ని సంపూర్ణంగా చిత్రించటానికి ప్రయత్నించిన మొట్టమొదటి కళారూపం నవల. మానవుడి రహస్య జీవితాన్ని దృశ్యమానం చేయగలిగిన శక్తి నవలకు ఉంది. సుప్రసిద్ధ రచయితా, విమర్శకుడు ఇ ఎం ఫార్ స్టర్ - నవలకూ, ఇతర కళారూపాలకు ఉన్న తేడా, నవలకున్న ప్రత్యేకతా ఇదేనని చెప్పాడు. కవిత్వం, నాటకం, సినిమా, చిత్రలేఖనం, సంగీతం మొదలైన కళలు చూపించే జీవిత వాస్తవికతకూ, నవల చూపించే జీవిత వాస్తవికతకు చాలా తేడా ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.