సంస్కృతి : నిర్వచనం, వ్యాప్తి
''ప్రకృతి' - 'సంస్కృతి' - 'వికృతి'- అనే మూడు మాటలు మానవ అస్తిత్వాన్ని, పరిణామాన్ని సంక్షిప్తంగా సూత్రీకరించే మూడు కీలకమైన పదాలు, ఒక తాత్త్విక త్రిపుటి. 'మానవుడు-మానవత' ప్రపంచానికి అర్థం చెప్పే త్రిపుటి, అవిభాజ్యమైన గుణధర్మం కలిగిన త్రిపుటి.
మానవుడికంటే పూర్వసిద్ధమైనది ప్రకృతి. మానవుడు లేదా ఓ ప్రాణి తన జీవన సౌలభ్యం కోసం సిద్ధపరచుకొనేది సంస్కృతి. హిత-మితాల ఔచిత్యం కోల్పోయినప్పుడు ప్రవృద్ధమయ్యేది వికృతి.
కార్యకారణ సంబంధాల నిరూపణకతీతంగా సకల కృతులను ప్రకృష్టంగా 'రూప్తీకరించేది' ప్రకృతి. కార్య కారణ సంబంధాలను గ్రహించి, 'ప్రజ్ఞావంతుడైన మానవుడు, ప్రకృతితో సమన్వయతను పాటిస్తూ - సమ్యక్ రీతిలో రూపీకరించు కొనేది సంస్కృతి కార్యకారణ సంబంధాలను భంగపరుస్తూ విరూపీకరించేది వికృతి.
ప్రజ్ఞ అంటే కేవలం తెలివి అని అర్థం కాదు. 'ప్ర' అంటే బాగా, 'జ్ఞ' అంటే గ్రహించడం. జరిగినదాన్ని, జరుగుతున్నదాన్ని, జరుగబోతున్న దాన్ని కలిపి సమగ్రంగా గ్రహించడమన్నమాట. గతానికి సంబంధించినది 'స్మృతి'. వర్తమానాన్ని వివేచించి చూడగలిగేది 'బుద్ధి'. భవిష్యత్తును-ఆగతాన్ని ఊహించగలిగేది 'మతి'. స్మృతి, బుద్ధి, మతులు కలిసినది ప్రజ్ఞ. ఇది ఒకరోజులో సిద్ధించే సామర్థ్యం కాదు. ప్రకృతిలో ఒక భాగంగా, రూపుదిద్దుకొన్న 'మానవు'డనే ప్రాణి, ఎంతోకాలం తన అస్తిత్వం కోసం ప్రకృతితో పోరాటం చేశాక, ఆకలి, దప్పికలతో పాటు తనలో కలుగుతున్న అనేక ఇతర ప్రాకృతిక భావాల మార్పులను, తన బయట కలుగుతున్న భావాల మార్పులను పరిశీలించడం ప్రారంభించాక, క్రమేపీ పెంచుకొన్న సామర్ధ్యం. ప్రకృతిలో ఓ ప్రాణి మాత్రంగా పుట్టినవాడు ఆ దశను చేరుకోవడానికి ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందో!.... తనలో - తన బయటా, ఉన్నదాన్ని సమగ్రంగా గ్రహించడం ప్రారంభించాక, ఉన్న దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికో, లేనిదాన్ని కొద్దిమార్పులతో తయారుచేసుకోవడానికో ప్రయత్నించాడు. అదే ప్రతిభ ప్రజ్ఞ తరువాత మనసుకు కలిగే సహజమైన సామర్థ్యం. ప్రజ్ఞా, ప్రతిభల....................
సంస్కృతి : నిర్వచనం, వ్యాప్తి ''ప్రకృతి' - 'సంస్కృతి' - 'వికృతి'- అనే మూడు మాటలు మానవ అస్తిత్వాన్ని, పరిణామాన్ని సంక్షిప్తంగా సూత్రీకరించే మూడు కీలకమైన పదాలు, ఒక తాత్త్విక త్రిపుటి. 'మానవుడు-మానవత' ప్రపంచానికి అర్థం చెప్పే త్రిపుటి, అవిభాజ్యమైన గుణధర్మం కలిగిన త్రిపుటి. మానవుడికంటే పూర్వసిద్ధమైనది ప్రకృతి. మానవుడు లేదా ఓ ప్రాణి తన జీవన సౌలభ్యం కోసం సిద్ధపరచుకొనేది సంస్కృతి. హిత-మితాల ఔచిత్యం కోల్పోయినప్పుడు ప్రవృద్ధమయ్యేది వికృతి. కార్యకారణ సంబంధాల నిరూపణకతీతంగా సకల కృతులను ప్రకృష్టంగా 'రూప్తీకరించేది' ప్రకృతి. కార్య కారణ సంబంధాలను గ్రహించి, 'ప్రజ్ఞావంతుడైన మానవుడు, ప్రకృతితో సమన్వయతను పాటిస్తూ - సమ్యక్ రీతిలో రూపీకరించు కొనేది సంస్కృతి కార్యకారణ సంబంధాలను భంగపరుస్తూ విరూపీకరించేది వికృతి. ప్రజ్ఞ అంటే కేవలం తెలివి అని అర్థం కాదు. 'ప్ర' అంటే బాగా, 'జ్ఞ' అంటే గ్రహించడం. జరిగినదాన్ని, జరుగుతున్నదాన్ని, జరుగబోతున్న దాన్ని కలిపి సమగ్రంగా గ్రహించడమన్నమాట. గతానికి సంబంధించినది 'స్మృతి'. వర్తమానాన్ని వివేచించి చూడగలిగేది 'బుద్ధి'. భవిష్యత్తును-ఆగతాన్ని ఊహించగలిగేది 'మతి'. స్మృతి, బుద్ధి, మతులు కలిసినది ప్రజ్ఞ. ఇది ఒకరోజులో సిద్ధించే సామర్థ్యం కాదు. ప్రకృతిలో ఒక భాగంగా, రూపుదిద్దుకొన్న 'మానవు'డనే ప్రాణి, ఎంతోకాలం తన అస్తిత్వం కోసం ప్రకృతితో పోరాటం చేశాక, ఆకలి, దప్పికలతో పాటు తనలో కలుగుతున్న అనేక ఇతర ప్రాకృతిక భావాల మార్పులను, తన బయట కలుగుతున్న భావాల మార్పులను పరిశీలించడం ప్రారంభించాక, క్రమేపీ పెంచుకొన్న సామర్ధ్యం. ప్రకృతిలో ఓ ప్రాణి మాత్రంగా పుట్టినవాడు ఆ దశను చేరుకోవడానికి ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందో!.... తనలో - తన బయటా, ఉన్నదాన్ని సమగ్రంగా గ్రహించడం ప్రారంభించాక, ఉన్న దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికో, లేనిదాన్ని కొద్దిమార్పులతో తయారుచేసుకోవడానికో ప్రయత్నించాడు. అదే ప్రతిభ ప్రజ్ఞ తరువాత మనసుకు కలిగే సహజమైన సామర్థ్యం. ప్రజ్ఞా, ప్రతిభల....................© 2017,www.logili.com All Rights Reserved.