'పాటల బాట'లో తెలకపల్లి
-------------- డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
ఇల కళలన్నీ శ్రమ జనితాలు
మానవులందరి కృషి ఫలితాలు
కళలకు లక్ష్యం కాసులు కాదు
కీర్తిప్రతిష్టల రాశులు కాదు
శ్రమైక జీవుల సౌభాగ్యం
సమస్త కళలకు పరమార్థం
మార్క్సిస్టు కళా సిద్ధాంతమంతా ఈ ఆరు పాదాలలో చెప్పారు తెలకపల్లి రవిగారు. మార్క్సిస్టు చింతనాపరుడైన తెలకపల్లి చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పత్రికారంగం, సినిమారంగం, రాజకీయాలు వంటి ఉపరితల పొరలన్నింటినీ సమన్వయం చేసి నిరంతరం మాధ్యమాల ద్వారా ప్రజలను జాగృతం చేస్తుంటారు. అనేక గ్రంథాలు రాశారు. ఆయన దాదాపు 1974 నుండి 2024 దాకా విభిన్న సందర్భాలలో రాసిన అనేక పాటల సంపుటి ఈ పుస్తకం. ఆయన పాటలు రాయడమే కాదు, పాడతారు కూడా. ఆయన ఎన్ని ఉపన్యాసాలిచ్చినా, వ్యాసాలూ, పుస్తకాలూ రాసినా, పాట శక్తి ఆయనకు బాగా తెలుసు. పాట ప్రజలలోకి నేరుగా వెళుతుంది. తేనె బొట్టును నాలుక మీద వేసుకోగానే తేనె రుచి తెలిసినట్లు, వింటుండగానే పాట శ్రోతల హృదయాల్లో చేరిపోతుంది. అలంకారాలు, భావచిత్రాలు, ప్రతీకలు, గేయ కవిత్వం కన్నా పాట చాలా వేగంగా లక్ష్యాలను చేరుకుంటుంది. ఈ సంపుటిలోని వేమన నృత్య రూపకం 2017లో అనంతపురంలో ప్రదర్శించినప్పుడు ఆ స్పందన నేను స్వయంగా చూసాను. పాట, ఆట కలిసి తొందరగా చలనం తీసుకొచ్చింది. తెలకపల్లి పాటలు శ్రోతలను కేంద్రంగా చేసుకుని ఆకట్టుకునే విధంగా రాయబడ్డాయి.
ఈ పాటలను రవిగారు 1974-2024 మధ్య రాశారు. మార్క్సిజం ప్రపంచమంతటా విస్తరించే శక్తిగా ఉన్న కాలం నుండి అనేక ప్రపంచ పరిణామాల తెలకపల్లి రవి............................
'పాటల బాట'లో తెలకపల్లి -------------- డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి ఇల కళలన్నీ శ్రమ జనితాలుమానవులందరి కృషి ఫలితాలు కళలకు లక్ష్యం కాసులు కాదుకీర్తిప్రతిష్టల రాశులు కాదు శ్రమైక జీవుల సౌభాగ్యంసమస్త కళలకు పరమార్థం మార్క్సిస్టు కళా సిద్ధాంతమంతా ఈ ఆరు పాదాలలో చెప్పారు తెలకపల్లి రవిగారు. మార్క్సిస్టు చింతనాపరుడైన తెలకపల్లి చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పత్రికారంగం, సినిమారంగం, రాజకీయాలు వంటి ఉపరితల పొరలన్నింటినీ సమన్వయం చేసి నిరంతరం మాధ్యమాల ద్వారా ప్రజలను జాగృతం చేస్తుంటారు. అనేక గ్రంథాలు రాశారు. ఆయన దాదాపు 1974 నుండి 2024 దాకా విభిన్న సందర్భాలలో రాసిన అనేక పాటల సంపుటి ఈ పుస్తకం. ఆయన పాటలు రాయడమే కాదు, పాడతారు కూడా. ఆయన ఎన్ని ఉపన్యాసాలిచ్చినా, వ్యాసాలూ, పుస్తకాలూ రాసినా, పాట శక్తి ఆయనకు బాగా తెలుసు. పాట ప్రజలలోకి నేరుగా వెళుతుంది. తేనె బొట్టును నాలుక మీద వేసుకోగానే తేనె రుచి తెలిసినట్లు, వింటుండగానే పాట శ్రోతల హృదయాల్లో చేరిపోతుంది. అలంకారాలు, భావచిత్రాలు, ప్రతీకలు, గేయ కవిత్వం కన్నా పాట చాలా వేగంగా లక్ష్యాలను చేరుకుంటుంది. ఈ సంపుటిలోని వేమన నృత్య రూపకం 2017లో అనంతపురంలో ప్రదర్శించినప్పుడు ఆ స్పందన నేను స్వయంగా చూసాను. పాట, ఆట కలిసి తొందరగా చలనం తీసుకొచ్చింది. తెలకపల్లి పాటలు శ్రోతలను కేంద్రంగా చేసుకుని ఆకట్టుకునే విధంగా రాయబడ్డాయి. ఈ పాటలను రవిగారు 1974-2024 మధ్య రాశారు. మార్క్సిజం ప్రపంచమంతటా విస్తరించే శక్తిగా ఉన్న కాలం నుండి అనేక ప్రపంచ పరిణామాల తెలకపల్లి రవి............................© 2017,www.logili.com All Rights Reserved.