విజ్ఞాన మేదోఖని మేరీక్యూరీ అత్యంత తెలివిగల విద్యార్ధినిగా బాసిల్లింది. ఆమె ఆనాడు ఒక బానిస దేశంగా ఉన్న పోలాండ్ లో జన్మించింది. ఆమె పేదకుటుంబంలో తల్లిదండ్రుల ముద్దు బిడ్డగా పెరిగింది. మరీ చిన్ననాటినుంచే పేదరికంతోనూ, ఒంటరి జీవితంలోనూ సహజీవనం చేసింది. తదనంతరకాలం తనలాంటి విజ్ఞానినే వివాహమాడింది. వారి జీవితం అసామాన్యమైనది. నిరంతరం ఇద్దరూ పరిశోధనల్లో మునిగితేలి, చివరకు అత్యంత అద్భుతమైన 'రేడియం' ను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఒక నూతన వైజ్ఞానిక అధ్యయనానికి తెరలేపింది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వ్యాధిగా పరిగణింపబడిన కాన్సెర్ కు ఒక చక్కటి చికిత్సా విధానాన్ని కూడా అందించింది. ఇది ఒక దంపతులు మానవ జాతికి సమర్పించిన గొప్ప వరప్రసాదమని చెప్పవచ్చు. మేరీక్యూరీ విజ్ఞానవేత్తగా ఎన్నో ఘన విజయాలు సాధించింది. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి మహిళ మేరీక్యూరీయే! ఇదేకాక రెండోసారి రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం పొంది చరిత్రలోనే రెండు సార్లు ఆ పురస్కారాన్ని పొందిన మహిళా శాస్త్రవేత్తగా కూడా ఆమె నిలిచింది!
ఈ మహత్తరమైన మహిళామని జీవితచరిత్ర, విజయపధం అందుకోవాలని ఆశించే యువతకు, ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులకు గొప్ప ప్రేరణ.
- ఎ.జి.యతిరాజులు
విజ్ఞాన మేదోఖని మేరీక్యూరీ అత్యంత తెలివిగల విద్యార్ధినిగా బాసిల్లింది. ఆమె ఆనాడు ఒక బానిస దేశంగా ఉన్న పోలాండ్ లో జన్మించింది. ఆమె పేదకుటుంబంలో తల్లిదండ్రుల ముద్దు బిడ్డగా పెరిగింది. మరీ చిన్ననాటినుంచే పేదరికంతోనూ, ఒంటరి జీవితంలోనూ సహజీవనం చేసింది. తదనంతరకాలం తనలాంటి విజ్ఞానినే వివాహమాడింది. వారి జీవితం అసామాన్యమైనది. నిరంతరం ఇద్దరూ పరిశోధనల్లో మునిగితేలి, చివరకు అత్యంత అద్భుతమైన 'రేడియం' ను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఒక నూతన వైజ్ఞానిక అధ్యయనానికి తెరలేపింది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వ్యాధిగా పరిగణింపబడిన కాన్సెర్ కు ఒక చక్కటి చికిత్సా విధానాన్ని కూడా అందించింది. ఇది ఒక దంపతులు మానవ జాతికి సమర్పించిన గొప్ప వరప్రసాదమని చెప్పవచ్చు. మేరీక్యూరీ విజ్ఞానవేత్తగా ఎన్నో ఘన విజయాలు సాధించింది. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి మహిళ మేరీక్యూరీయే! ఇదేకాక రెండోసారి రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం పొంది చరిత్రలోనే రెండు సార్లు ఆ పురస్కారాన్ని పొందిన మహిళా శాస్త్రవేత్తగా కూడా ఆమె నిలిచింది! ఈ మహత్తరమైన మహిళామని జీవితచరిత్ర, విజయపధం అందుకోవాలని ఆశించే యువతకు, ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులకు గొప్ప ప్రేరణ. - ఎ.జి.యతిరాజులు© 2017,www.logili.com All Rights Reserved.