ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణాకు అనుకూల, ప్రతికూల ఉద్యమం రూపుదిద్దుకొని నాయకులు, ప్రజలు రెండు తీరులైన సందర్భం. ఈ సందర్భంగా గతం తెలుసుకోవాలని రాజకీయ వాదులకు, ప్రజలకు సహజంగా ఆసక్తి ఉంటుంది. గతం గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం అనేక మంది ప్రముఖుల చేత రాయబడిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రుల ప్రాచీన చరిత్ర అని, ఆధునిక చరిత్ర అని, బ్రిటిష్ పరిపాలన, విజయనగర రాజుల పరిపాలన, కాకతీయుల చరిత్ర, నైజాం పరిపాలన, తెలంగాణా రైతాంగ పోరాటం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, ప్రత్యేకాంధ్ర ఏర్పాటు, విశాలాంధ్ర ఏర్పాటు, ప్రత్యెక తెలంగాణా అని, గోల్కొండ నవాబులని ఇలా దేనికదే పెద్ద గ్రంథాలుగా రాయబడి ఉన్నాయి. 1956 లో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పటి నుంచి ఇప్పటికి 56 సం.లు అయింది. 1982 లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పటికి 30 సం.లు ప్రజా జీవితంలో ఉన్నా. అయినప్పటికీ నాకు పైన చెప్పిన ఆ పుస్తకాలను చదివే అవకాసం కానీ, తీరిక గానీ లేక అసంపూర్తి సమాచారం తోనే ఉన్నాననేది నా భావన.
ప్రస్తుతం నా ఈ అనుభవాన్ని అందరిలోనూ ఉహించుకుని ఓపిక తెచ్చుకున్నాను. గతంలో పెద్దలు రాసిన గ్రంథాలను చదివాను. నాటి నుండి నేటి వరకు చరిత్ర అంతా క్లుప్తంగా కేవలం 3 - 4 గంటల్లో ఎవరైనా చదివే విధంగా ఉండాలని చరిత్రలో క్రీ.పూ.300 నుండి ఇప్పటివరకు జరిగిన ముఖ్యమైన ఘట్టాలను అవసరమైనంతవరకు ఆవిష్కరించడమైనది.
చదువరులకు ఈ రచన తప్పక ఆసక్తికరంగా ఉంటుందని ఆశిస్తూ....
- డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు
ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణాకు అనుకూల, ప్రతికూల ఉద్యమం రూపుదిద్దుకొని నాయకులు, ప్రజలు రెండు తీరులైన సందర్భం. ఈ సందర్భంగా గతం తెలుసుకోవాలని రాజకీయ వాదులకు, ప్రజలకు సహజంగా ఆసక్తి ఉంటుంది. గతం గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం అనేక మంది ప్రముఖుల చేత రాయబడిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రుల ప్రాచీన చరిత్ర అని, ఆధునిక చరిత్ర అని, బ్రిటిష్ పరిపాలన, విజయనగర రాజుల పరిపాలన, కాకతీయుల చరిత్ర, నైజాం పరిపాలన, తెలంగాణా రైతాంగ పోరాటం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, ప్రత్యేకాంధ్ర ఏర్పాటు, విశాలాంధ్ర ఏర్పాటు, ప్రత్యెక తెలంగాణా అని, గోల్కొండ నవాబులని ఇలా దేనికదే పెద్ద గ్రంథాలుగా రాయబడి ఉన్నాయి. 1956 లో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పటి నుంచి ఇప్పటికి 56 సం.లు అయింది. 1982 లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇప్పటికి 30 సం.లు ప్రజా జీవితంలో ఉన్నా. అయినప్పటికీ నాకు పైన చెప్పిన ఆ పుస్తకాలను చదివే అవకాసం కానీ, తీరిక గానీ లేక అసంపూర్తి సమాచారం తోనే ఉన్నాననేది నా భావన. ప్రస్తుతం నా ఈ అనుభవాన్ని అందరిలోనూ ఉహించుకుని ఓపిక తెచ్చుకున్నాను. గతంలో పెద్దలు రాసిన గ్రంథాలను చదివాను. నాటి నుండి నేటి వరకు చరిత్ర అంతా క్లుప్తంగా కేవలం 3 - 4 గంటల్లో ఎవరైనా చదివే విధంగా ఉండాలని చరిత్రలో క్రీ.పూ.300 నుండి ఇప్పటివరకు జరిగిన ముఖ్యమైన ఘట్టాలను అవసరమైనంతవరకు ఆవిష్కరించడమైనది. చదువరులకు ఈ రచన తప్పక ఆసక్తికరంగా ఉంటుందని ఆశిస్తూ.... - డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.