ఈ పుస్తకంలో వ్రాయబడిన చట్టం "భూ సేకరణలో సముచిత పరిహారము మరియు పారదర్శకత, పునరావాసం మరియు పునర్ ఉపాధికల్పనా పొందే హక్కు చట్టం 2013" అనునది భూ సేకరణ చట్టమును పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశ్యంతో తయారు చేయబడినది. భూసేకరణ వల్ల నష్టపోయినవారికి న్యాయం జరగాలనే భావనతో ఈ చట్టం రూపకల్పన చేయబడినది. గత చట్టం ప్రకారం ప్రభుత్వం ఇతర సంస్థల కోసం ప్రైవేట్ భూయజమానులు నుంచి భూసేకరణ సులభంగా చేసేది. ఇప్పటివరకూ జరిగిన భూసేకరణ అంతా మానవ ఉల్లంఘనే. ప్రజాసంక్షేమం కోసం, సామాజిక అభివృద్ధి, వికాసం కోసం, ఆర్థిక ప్రగతి కోసం భూసేకరణ అనివార్యమైనప్పటికీ ప్రభుత్వం ఒక దోపిడీ దొంగలాగా వ్యవహరిస్తూ, పెట్టుబడిదారుల, బహుళజాతి కంపెనీల కోసం, సామాన్య, పేద రైతుల నుండి భూమిని అతితక్కువ ధరకు దౌర్జన్యంగా, బలవంతంగా సేకరిస్తున్నదని అభ్యుదయవాదుల, ప్రజాస్వామ్యవాదుల అభ్యంతరము. కానీ ఈ పై నూతన చట్టం అమలులోకి వచ్చిన తరువాత ప్రభుత్వం కోసం కానీ, ఇతర సంస్థల వారి విషయంలోకానీ ప్రైవేట్ భూ యజమానుల నుండి భూ సేకరణ అనేది కష్ట తరమవుతుంది.
- డా. పోతరాజు వెంకటేశ్వరరావు