'చరిత్ర' అనేది సమస్త శాస్త్రాలనూ, సాహిత్యాన్నీ, సరిహద్దుల్లో ఇమడనంత సమాజాన్నీ చంకలో ఇరికించుకునే భారిస్వరూపం. వీలైనంత తేలిగ్గా చెప్పాలనుకున్న నా పూనికకు దాట శక్యం గాని అవరోధాలెన్నెన్నో అడుగడుగునా అడ్డుకున్నాయి. అందులోనూ ముఖ్యంగా వచ్చిన చిక్కంతా పేర్లను తెలిపే సంజ్ఞానామవాచకాలతో. ఇవి ఒక దేశానివీ అయ్యుండవు, ఒక భాషవి అయ్యుండవు. ఇవిగాక, సామాన్య పాఠకునికి పరిచయం లేని సాంకేతిక పదాలు గూడా గమనంలో జోరబడతాయి. సహించి గుర్తుంచుకోవాడమే తప్ప నొప్పిని తొలగించే ఉపశమనం వీటికి లేదు. మరో తకరారు వచ్చేది మ్యాపులతో. స్వీకరించేందుకు యోగ్యమైన భారతదేశ పటాన్నైనా తెలుగుభాషలో పట్టుకోవడం కష్టం. ఆ కారణంగా, పుస్తకం తెలుగుభాషధైనా మ్యాపులు ఆంగ్లంలో చూపించక తప్పిందిగాదు. ఈ ఇబ్బందిని దాటుకునే తరుణం తెలుగుజాతికి సంక్రమించే అదనుకోసం ఎదురుజూస్తూ -
- ఎం. వి రమణారెడ్డి
'చరిత్ర' అనేది సమస్త శాస్త్రాలనూ, సాహిత్యాన్నీ, సరిహద్దుల్లో ఇమడనంత సమాజాన్నీ చంకలో ఇరికించుకునే భారిస్వరూపం. వీలైనంత తేలిగ్గా చెప్పాలనుకున్న నా పూనికకు దాట శక్యం గాని అవరోధాలెన్నెన్నో అడుగడుగునా అడ్డుకున్నాయి. అందులోనూ ముఖ్యంగా వచ్చిన చిక్కంతా పేర్లను తెలిపే సంజ్ఞానామవాచకాలతో. ఇవి ఒక దేశానివీ అయ్యుండవు, ఒక భాషవి అయ్యుండవు. ఇవిగాక, సామాన్య పాఠకునికి పరిచయం లేని సాంకేతిక పదాలు గూడా గమనంలో జోరబడతాయి. సహించి గుర్తుంచుకోవాడమే తప్ప నొప్పిని తొలగించే ఉపశమనం వీటికి లేదు. మరో తకరారు వచ్చేది మ్యాపులతో. స్వీకరించేందుకు యోగ్యమైన భారతదేశ పటాన్నైనా తెలుగుభాషలో పట్టుకోవడం కష్టం. ఆ కారణంగా, పుస్తకం తెలుగుభాషధైనా మ్యాపులు ఆంగ్లంలో చూపించక తప్పిందిగాదు. ఈ ఇబ్బందిని దాటుకునే తరుణం తెలుగుజాతికి సంక్రమించే అదనుకోసం ఎదురుజూస్తూ - - ఎం. వి రమణారెడ్డిgood book
© 2017,www.logili.com All Rights Reserved.