"మల్లీశ్వరి" గొప్పతనం తెలుసుకోవడానికి ఆ చిత్రం చూడటం ముఖ్యం. తెరమీద కాకపోయినా ఇంట్లో, విరివిగా విడియో సౌకర్యాలున్న ఈరోజుల్లో అదేమంత కష్టంకాదు. అయితే సినిమా దర్శకుడు నిర్ణయించిన 'వడి' తోనే నడుస్తుంది. నింపాదిగా నడపలేము. సినిమా నవల అలా కాదు; కావలసిన భాగం కావలసినన్ని మార్లు అవసరానికి తగిన పద్దతిలో చదువుకోగలం. ఆ స్మృతులను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుని దాని రసం తిరిగి తిరిగి ఆశ్వాదించగలం. పుస్తకం అందుబాటులో ఉన్నట్లు వీడియో ఉండదు. వీడియోకున్న ద్రుశ్యగుణం పుస్తకానికి లేదు. కాని రెండు మూడు సార్లు సినిమా చూసుకున్న తరువాత నవల చదువుతుంటే మన జ్ఞాపకాలే మనోయవనికపై ఆ చిత్రాన్ని ప్రదర్శింపచేస్తాయి.
"మల్లీశ్వరి" గొప్పతనం తెలుసుకోవడానికి ఆ చిత్రం చూడటం ముఖ్యం. తెరమీద కాకపోయినా ఇంట్లో, విరివిగా విడియో సౌకర్యాలున్న ఈరోజుల్లో అదేమంత కష్టంకాదు. అయితే సినిమా దర్శకుడు నిర్ణయించిన 'వడి' తోనే నడుస్తుంది. నింపాదిగా నడపలేము. సినిమా నవల అలా కాదు; కావలసిన భాగం కావలసినన్ని మార్లు అవసరానికి తగిన పద్దతిలో చదువుకోగలం. ఆ స్మృతులను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుని దాని రసం తిరిగి తిరిగి ఆశ్వాదించగలం. పుస్తకం అందుబాటులో ఉన్నట్లు వీడియో ఉండదు. వీడియోకున్న ద్రుశ్యగుణం పుస్తకానికి లేదు. కాని రెండు మూడు సార్లు సినిమా చూసుకున్న తరువాత నవల చదువుతుంటే మన జ్ఞాపకాలే మనోయవనికపై ఆ చిత్రాన్ని ప్రదర్శింపచేస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.