అది పదిహేనవ శతాబ్దం. యూరపులో చీకటి యుగం ముగిసిపోతున్న దశ. యూరపుకి ఆవలున్న ప్రపంచాన్ని అన్వేషించడానికి ఎందరో సాహసికులు బయల్దేరారు. ఆ ప్రయాణంలోనే ప్రాణాలు కోల్పోయిన అజ్ఞాత వీరులెందరో! అప్పటికి భోగ భాగ్యాలతో తులతూగుతున్న భారత్ నీ చైనానీ చేరుకోవడానికి అనువైన సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి మరికొందరు బయల్దేరారు. సాహస యాత్రికుల్లో సుప్రసిద్దులైన వారిలో ముగ్గురుని ఎంచి వారిని పరిచయం చేయడమే ఈ పుస్తకం - లోకం చుట్టిన వీరులు లక్ష్యం. ఆ ముగ్గురిలో మొదటివాడు కొలంబస్. రెండవవాడు వాస్కోద గామా. మూడోవాడు మెజాలెన్.
ఇండియా చేరుకోవాలని, భూమి గుండ్రంగా ఉంది కనుక, పశ్చిమ దిశలో అపారమైన సముద్రానికి ఎదురొడ్డి పయనించిన సాహసి కొలంబస్. యూరపు నుంచి ఇండియాకు సముద్రమార్గాన్ని కనుగొని అటు యూరపు చరిత్ర, ఇటు భారత చరిత్ర మారిపోవడానికి దోహదపడినవాడు వాస్కోద గామా. భూమి గుండ్రంగా ఉందని అప్పటికి నిర్ధారణ లేకపోయినా దాన్ని నమ్మి దాదాపు లోకమంతటినీ చుట్టివచ్చినవాడు మెజాలెన్.
అది పదిహేనవ శతాబ్దం. యూరపులో చీకటి యుగం ముగిసిపోతున్న దశ. యూరపుకి ఆవలున్న ప్రపంచాన్ని అన్వేషించడానికి ఎందరో సాహసికులు బయల్దేరారు. ఆ ప్రయాణంలోనే ప్రాణాలు కోల్పోయిన అజ్ఞాత వీరులెందరో! అప్పటికి భోగ భాగ్యాలతో తులతూగుతున్న భారత్ నీ చైనానీ చేరుకోవడానికి అనువైన సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి మరికొందరు బయల్దేరారు. సాహస యాత్రికుల్లో సుప్రసిద్దులైన వారిలో ముగ్గురుని ఎంచి వారిని పరిచయం చేయడమే ఈ పుస్తకం - లోకం చుట్టిన వీరులు లక్ష్యం. ఆ ముగ్గురిలో మొదటివాడు కొలంబస్. రెండవవాడు వాస్కోద గామా. మూడోవాడు మెజాలెన్. ఇండియా చేరుకోవాలని, భూమి గుండ్రంగా ఉంది కనుక, పశ్చిమ దిశలో అపారమైన సముద్రానికి ఎదురొడ్డి పయనించిన సాహసి కొలంబస్. యూరపు నుంచి ఇండియాకు సముద్రమార్గాన్ని కనుగొని అటు యూరపు చరిత్ర, ఇటు భారత చరిత్ర మారిపోవడానికి దోహదపడినవాడు వాస్కోద గామా. భూమి గుండ్రంగా ఉందని అప్పటికి నిర్ధారణ లేకపోయినా దాన్ని నమ్మి దాదాపు లోకమంతటినీ చుట్టివచ్చినవాడు మెజాలెన్.© 2017,www.logili.com All Rights Reserved.