పాకాల యశోదారెడ్డి జీవన రేఖలు
బహుముఖ ప్రజ్ఞావంతురాలైన యశోదారెడ్డి, పరిశోధకురాలిగా, విమర్శకు రాలిగా, కథా రచయిత్రిగా, నాటక రచయిత్రిగా, కవయిత్రిగా అనువాదకురాలిగా తెలుగు సాహితీరంగంలో ప్రసిద్ధి పొందారు. ఉత్తమ అధ్యాపకురాలిగా, సమీక్షకురాలిగా, సంపాదకురాలిగా, బాలసాహిత్య రచయిత్రిగా, మహావక్తగా, తెలంగాణ మాండలికానికి అచ్చమైన ప్రతీకగా కీర్తిపొందిన పాకాల యశోదారెడ్డి సంస్కృత సమాస భూయిష్ఠమైన సంప్రదాయ సాహిత్య విమర్శలోనూ, సహజ సుందరమైన జానపదులనుడికారంలోనూ రచనలను చేసిన సవ్యసాచి.
జీవితాంతం తెలుగు సాహిత్య వికాసానికీ, సాంస్కృతిక వైభవోన్నతికీ, తెలంగాణ మాండలిక పదసంపద పరిరక్షణకు పాటుపడిన యశోదారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లిలో 8.8.1929 నాడు సరస్వతమ్మ, కాశిరెడ్డి దంపతులకు జన్మించారు. మూలనక్షత్రంలో పుట్టిందనీ, తల్లికి గండం అనీ బ్రాహ్మణులు అన్నారు. వారన్నట్లుగానే పుట్టిన నెలన్నరకే సరస్వతమ్మ అకాల మృత్యువుపాలయ్యింది. నాటి నుండీ తండ్రి, తల్లి చావుకు కారణం పుట్టిన బిడ్డే అని ఆమెను నిరాదరించి నిర్లక్ష్యం చేసాడు. తండ్రి నిరాదరణం, "పుట్టంగనే తల్లిని మింగినపిల్ల" అనే ఇరుగు పొరుగు వారి మాటలు, బంధువుల ములుకుల్లాంటి పలుకులు ఆమె మనస్సులో ముద్రవేసుకొని తనవల్లనే తల్లిపోయిందనే భావం జీవితాంతం బాధించింది. ఆ బాధ ఆమె రాసిన 'గంగరేగిచెట్టు' వంటి కథల్లో కూడా ప్రతిఫలించింది. యశోదమ్మ ఏడు సంవత్సరాలు వచ్చేసరికి తండ్రిని కూడా పోగొట్టుకున్నారు. తల్లినీ, తండ్రినీ ఇద్దరినీ పోగొట్టుకున్న యశోదమ్మను దూరపు బంధువు రుక్ష్మిణమ్మ ఆదరించి పెంచి పెద్ద చేసారు. చాలా సంవత్సరాలు ఆమె రుక్మిణమ్మనే కన్నతల్లి అనుకునేవారు. వీధిలో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు..............
పాకాల యశోదారెడ్డి జీవన రేఖలు బహుముఖ ప్రజ్ఞావంతురాలైన యశోదారెడ్డి, పరిశోధకురాలిగా, విమర్శకు రాలిగా, కథా రచయిత్రిగా, నాటక రచయిత్రిగా, కవయిత్రిగా అనువాదకురాలిగా తెలుగు సాహితీరంగంలో ప్రసిద్ధి పొందారు. ఉత్తమ అధ్యాపకురాలిగా, సమీక్షకురాలిగా, సంపాదకురాలిగా, బాలసాహిత్య రచయిత్రిగా, మహావక్తగా, తెలంగాణ మాండలికానికి అచ్చమైన ప్రతీకగా కీర్తిపొందిన పాకాల యశోదారెడ్డి సంస్కృత సమాస భూయిష్ఠమైన సంప్రదాయ సాహిత్య విమర్శలోనూ, సహజ సుందరమైన జానపదులనుడికారంలోనూ రచనలను చేసిన సవ్యసాచి. జీవితాంతం తెలుగు సాహిత్య వికాసానికీ, సాంస్కృతిక వైభవోన్నతికీ, తెలంగాణ మాండలిక పదసంపద పరిరక్షణకు పాటుపడిన యశోదారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లిలో 8.8.1929 నాడు సరస్వతమ్మ, కాశిరెడ్డి దంపతులకు జన్మించారు. మూలనక్షత్రంలో పుట్టిందనీ, తల్లికి గండం అనీ బ్రాహ్మణులు అన్నారు. వారన్నట్లుగానే పుట్టిన నెలన్నరకే సరస్వతమ్మ అకాల మృత్యువుపాలయ్యింది. నాటి నుండీ తండ్రి, తల్లి చావుకు కారణం పుట్టిన బిడ్డే అని ఆమెను నిరాదరించి నిర్లక్ష్యం చేసాడు. తండ్రి నిరాదరణం, "పుట్టంగనే తల్లిని మింగినపిల్ల" అనే ఇరుగు పొరుగు వారి మాటలు, బంధువుల ములుకుల్లాంటి పలుకులు ఆమె మనస్సులో ముద్రవేసుకొని తనవల్లనే తల్లిపోయిందనే భావం జీవితాంతం బాధించింది. ఆ బాధ ఆమె రాసిన 'గంగరేగిచెట్టు' వంటి కథల్లో కూడా ప్రతిఫలించింది. యశోదమ్మ ఏడు సంవత్సరాలు వచ్చేసరికి తండ్రిని కూడా పోగొట్టుకున్నారు. తల్లినీ, తండ్రినీ ఇద్దరినీ పోగొట్టుకున్న యశోదమ్మను దూరపు బంధువు రుక్ష్మిణమ్మ ఆదరించి పెంచి పెద్ద చేసారు. చాలా సంవత్సరాలు ఆమె రుక్మిణమ్మనే కన్నతల్లి అనుకునేవారు. వీధిలో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు..............© 2017,www.logili.com All Rights Reserved.