ఉమ్మెత్త పూలు
నింగి నుండి నేలకు ఏకధాటిగా కురుస్తున్న వర్షపు ధారను చూస్తున్న కమలకు బయట ఎవరో తలుపు తడుతున్నట్టు అనిపించింది. చంపలపై చారలు కట్టిన కన్నీటిని తుడుచుకుంటూ వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగా బాగా తడిసి ముద్దయిపోయిన ఒక అమ్మాయి నిలబడుంది. చూడటానికి పల్లెటూరి అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి వయసు పది, పన్నెండేళ్ల మధ్య ఉండొచ్చు!
అమాయకత్వం చిందే ఆ ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ నిండి ఉంది. వదులు జాకెట్టు, పొడవాటి పావడా ధరించింది. పావడను మోకాలి దాకా మడిచి కొసని బొడ్డులో దోపుకుని ఉంది. ఒంటి నుండి బొట్లుబొట్లుగా కారుతున్న నీళ్లు ధారగా ప్రవహిస్తోంది!!
ప్రశ్నార్ధకంగా అమ్మాయి కళ్లల్లోకి చూసింది కమల.
ఆ అమ్మాయి కళ్లు రెపరెపలాడించి, "తడిసి ముద్దయిపోయా, కూసింత పోటీందమ్మగోరూ తల దాసుకుంటాను. వొర్పం తగ్గేక బేగెల్లి పోతానమ్మగోరూ." అంటూ రెండు చేతులూ జోడించి అర్థించింది.
రమ్మన్నట్టుగా తలాడించి పక్కకు జరిగింది....................
ఉమ్మెత్త పూలు నింగి నుండి నేలకు ఏకధాటిగా కురుస్తున్న వర్షపు ధారను చూస్తున్న కమలకు బయట ఎవరో తలుపు తడుతున్నట్టు అనిపించింది. చంపలపై చారలు కట్టిన కన్నీటిని తుడుచుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా బాగా తడిసి ముద్దయిపోయిన ఒక అమ్మాయి నిలబడుంది. చూడటానికి పల్లెటూరి అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి వయసు పది, పన్నెండేళ్ల మధ్య ఉండొచ్చు! అమాయకత్వం చిందే ఆ ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ నిండి ఉంది. వదులు జాకెట్టు, పొడవాటి పావడా ధరించింది. పావడను మోకాలి దాకా మడిచి కొసని బొడ్డులో దోపుకుని ఉంది. ఒంటి నుండి బొట్లుబొట్లుగా కారుతున్న నీళ్లు ధారగా ప్రవహిస్తోంది!! ప్రశ్నార్ధకంగా అమ్మాయి కళ్లల్లోకి చూసింది కమల. ఆ అమ్మాయి కళ్లు రెపరెపలాడించి, "తడిసి ముద్దయిపోయా, కూసింత పోటీందమ్మగోరూ తల దాసుకుంటాను. వొర్పం తగ్గేక బేగెల్లి పోతానమ్మగోరూ." అంటూ రెండు చేతులూ జోడించి అర్థించింది. రమ్మన్నట్టుగా తలాడించి పక్కకు జరిగింది....................© 2017,www.logili.com All Rights Reserved.