ఇంక ఆలస్యం ఎందుకండీ బాబూ!!
అబ్బో ఏమి నవలండీ బాబూ... టి ఏస్సే గారు గుక్క తిప్పుకోకుండా చెప్పేయడం, నేను కళ్ళు తిప్పుకోకుండా చదివేయడం ఒక్క సారిగా జరిగిపోయాయి. ఈ నవల జంధ్యాల గారి కంట పడుంటేనా... అర్జెంట్గా రాజేంద్ర ప్రసాద్ - రజనీలతో సినిమా తీసేసే వారే కదా.
కథ ఉన్నా లేకున్నా చదివించే గుణం టి ఎస్సే రచనలలో మెండుగా ఉంటుందని నాకు తెలుసు. అయితే ఈ నవలలో చాలా మంచి కథ ఉండటమే కాకుండా చదివించే గుణం కొత్త ఎత్తుకు చేరి కొండెక్కి కూర్చుంది. కథనంలో హాస్యం ఎలా తన్నుకొచ్చిందో మచ్చుకు... కేవలం మచ్చుకు కొన్ని మీతో పంచుకుంటాను.
ఆ అమ్మాయిని చూసి కింద పడిపోయాడు అనడం మనం వినే ఉంటాం. పడిపోవడమంటే నిజంగా పడిపోవడమైతే ఎలా ఉంటుందో మల్లిక్ స్టైల్లో ఎలా చెప్పాడో ఒకసారి చూడండి...
"ఏడ్చారు. అయినా మేమేం చేసామురా. ఆ అమ్మాయిని చూడగానే అలా చొంగ కారుస్తూ కింద పడిపోవడమేనా?” అన్నాడు కాజా హుస్సేన్.
“మతి ఉండో మతి లేకో నేను పడిపోయాననుకో... ఎకాఎకిన నన్నలా పట్టుకు వచ్చేయడమేనా? ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడుంటుంది? ఏం చేస్తోంది? మొదలైన వివరాలు కనుక్కోవాల్సిన పని లేదా?"
“మాయదారి మూర్ఛరోగమో మరేదైనా హార్ట్ ప్రాబ్లమో సంప్రాప్తమయిందనుకుని హడిలి చస్తూ నిన్ను ఆస్పత్రికి మోసుకుపోవడం ఆలస్యం... ఏ మందూ మాకూ లేకనే దిట్టంగా లేచి కూర్చుని ఆ సుందరాంగి చిరునామా కనుక్కోలేదని మమ్మల్నిలా రెండురోజులుగా నానా హైరానా పెడ్తున్నావా? నీవు మనిషివి కానే కాదురోయ్" అన్నాడు వర్మ మండిపోతూ.................
ఇంక ఆలస్యం ఎందుకండీ బాబూ!! అబ్బో ఏమి నవలండీ బాబూ... టి ఏస్సే గారు గుక్క తిప్పుకోకుండా చెప్పేయడం, నేను కళ్ళు తిప్పుకోకుండా చదివేయడం ఒక్క సారిగా జరిగిపోయాయి. ఈ నవల జంధ్యాల గారి కంట పడుంటేనా... అర్జెంట్గా రాజేంద్ర ప్రసాద్ - రజనీలతో సినిమా తీసేసే వారే కదా. కథ ఉన్నా లేకున్నా చదివించే గుణం టి ఎస్సే రచనలలో మెండుగా ఉంటుందని నాకు తెలుసు. అయితే ఈ నవలలో చాలా మంచి కథ ఉండటమే కాకుండా చదివించే గుణం కొత్త ఎత్తుకు చేరి కొండెక్కి కూర్చుంది. కథనంలో హాస్యం ఎలా తన్నుకొచ్చిందో మచ్చుకు... కేవలం మచ్చుకు కొన్ని మీతో పంచుకుంటాను. ఆ అమ్మాయిని చూసి కింద పడిపోయాడు అనడం మనం వినే ఉంటాం. పడిపోవడమంటే నిజంగా పడిపోవడమైతే ఎలా ఉంటుందో మల్లిక్ స్టైల్లో ఎలా చెప్పాడో ఒకసారి చూడండి... "ఏడ్చారు. అయినా మేమేం చేసామురా. ఆ అమ్మాయిని చూడగానే అలా చొంగ కారుస్తూ కింద పడిపోవడమేనా?” అన్నాడు కాజా హుస్సేన్. “మతి ఉండో మతి లేకో నేను పడిపోయాననుకో... ఎకాఎకిన నన్నలా పట్టుకు వచ్చేయడమేనా? ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడుంటుంది? ఏం చేస్తోంది? మొదలైన వివరాలు కనుక్కోవాల్సిన పని లేదా?" “మాయదారి మూర్ఛరోగమో మరేదైనా హార్ట్ ప్రాబ్లమో సంప్రాప్తమయిందనుకుని హడిలి చస్తూ నిన్ను ఆస్పత్రికి మోసుకుపోవడం ఆలస్యం... ఏ మందూ మాకూ లేకనే దిట్టంగా లేచి కూర్చుని ఆ సుందరాంగి చిరునామా కనుక్కోలేదని మమ్మల్నిలా రెండురోజులుగా నానా హైరానా పెడ్తున్నావా? నీవు మనిషివి కానే కాదురోయ్" అన్నాడు వర్మ మండిపోతూ.................© 2017,www.logili.com All Rights Reserved.