నన్ను గూర్చి నాలుగు మాటలు
నా కలం పేరు మరియు నా పూర్తి పేరు: టి.ఎస్.ఏ. కృష్ణమూర్తి
(టి. కృష్ణమూర్తి లేక తొడిమెల్ల కృష్ణమూర్తి S/o టి.ఎస్. ఆంజనేయులు)
చల్లని పుణ్యభూమి మదనపల్లె (అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్) లో 1950 వ సంవత్సరంలో జన్మించాను. నా తల్లిదండ్రులు శ్రీ టి.ఎస్. ఆంజనేయులు మరియు శ్రీమతి కమలాక్షి (కమలమ్మ) గార్లు, నా శ్రీమతి బి. కళావతమ్మ. టి. శివభారతమూర్తి, ప్రసన్నలక్ష్మి నా పిల్లలు. ఎన్.కె. నిత్య, కె. రెడ్డెప్ప కోడలు, అల్లుడు, ముగ్గురు మనవళ్ళు ఒక మనవరాలితో నిండు దిగువ మధ్య తరగతి జీవితం అనుభవిస్తున్నాము. వృత్తిరీత్యా విశ్రాంత మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ గుమస్తా... ప్రవృత్తిరీత్యా రచయిత.
1968లో రాయడం మొదలు పెట్టాను. మొట్టమొదటి పెద్ద కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో మెడ్రాస్ కళానికేతన్ స్టూడియో వారి గేవా కలర్ చిత్రాలతో 1971లో ప్రచురితమైంది. కాస్త బాగా వ్రాయగల కథకుడుగా 1974 నుండి గుర్తింపు. 300 కథలు, 10 పెద్ద కథలు, ఆరు నవలలు, వందకు పైగా పరిచయాలు, వ్యాసాలు, ముందుమాటలు వ్రాసాను. వాటిలో 80 శాతం పైగా పత్రికలలో అచ్చయ్యాయి. తదుపరి గ్రంధ రూపాలు దాల్చాయి. ఇప్పటికి 25 గ్రంథాలు వెలువరించాను. కొన్ని కథలు, రెండు నవలలు కన్నడ భాషలోకి, కొన్ని కథలు ఆంగ్లభాషలోకి అనువదించ బడినవి. కన్నడలో అనువదింపబడిన నా నవలలు గ్రంథ రూపాలుగా వెలువడి కర్నాటకలో ప్రసిద్ధిగాంచాయి.
2013 వరకు వెలువడిన నా రచనల మీద ఎస్వీ యూనివర్సిటీ నుండి శ్రీ ఏ. రమాకుమార్ యాదవ్ నాలుగు సంవత్సరాలు పరిశోధన సల్ఫి వీహెచ్. డి పట్టం పొందారు. 3 పురస్కారాలు పొందిన నా ఆయుధం నవల మీద చెన్నై యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ గారి పర్యవేక్షణలో శ్రీ జి. శ్రీధర్ పిహెచ్.డి చేయుచున్నారు....................
నన్ను గూర్చి నాలుగు మాటలు నా కలం పేరు మరియు నా పూర్తి పేరు: టి.ఎస్.ఏ. కృష్ణమూర్తి (టి. కృష్ణమూర్తి లేక తొడిమెల్ల కృష్ణమూర్తి S/o టి.ఎస్. ఆంజనేయులు)చల్లని పుణ్యభూమి మదనపల్లె (అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్) లో 1950 వ సంవత్సరంలో జన్మించాను. నా తల్లిదండ్రులు శ్రీ టి.ఎస్. ఆంజనేయులు మరియు శ్రీమతి కమలాక్షి (కమలమ్మ) గార్లు, నా శ్రీమతి బి. కళావతమ్మ. టి. శివభారతమూర్తి, ప్రసన్నలక్ష్మి నా పిల్లలు. ఎన్.కె. నిత్య, కె. రెడ్డెప్ప కోడలు, అల్లుడు, ముగ్గురు మనవళ్ళు ఒక మనవరాలితో నిండు దిగువ మధ్య తరగతి జీవితం అనుభవిస్తున్నాము. వృత్తిరీత్యా విశ్రాంత మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ గుమస్తా... ప్రవృత్తిరీత్యా రచయిత. 1968లో రాయడం మొదలు పెట్టాను. మొట్టమొదటి పెద్ద కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో మెడ్రాస్ కళానికేతన్ స్టూడియో వారి గేవా కలర్ చిత్రాలతో 1971లో ప్రచురితమైంది. కాస్త బాగా వ్రాయగల కథకుడుగా 1974 నుండి గుర్తింపు. 300 కథలు, 10 పెద్ద కథలు, ఆరు నవలలు, వందకు పైగా పరిచయాలు, వ్యాసాలు, ముందుమాటలు వ్రాసాను. వాటిలో 80 శాతం పైగా పత్రికలలో అచ్చయ్యాయి. తదుపరి గ్రంధ రూపాలు దాల్చాయి. ఇప్పటికి 25 గ్రంథాలు వెలువరించాను. కొన్ని కథలు, రెండు నవలలు కన్నడ భాషలోకి, కొన్ని కథలు ఆంగ్లభాషలోకి అనువదించ బడినవి. కన్నడలో అనువదింపబడిన నా నవలలు గ్రంథ రూపాలుగా వెలువడి కర్నాటకలో ప్రసిద్ధిగాంచాయి. 2013 వరకు వెలువడిన నా రచనల మీద ఎస్వీ యూనివర్సిటీ నుండి శ్రీ ఏ. రమాకుమార్ యాదవ్ నాలుగు సంవత్సరాలు పరిశోధన సల్ఫి వీహెచ్. డి పట్టం పొందారు. 3 పురస్కారాలు పొందిన నా ఆయుధం నవల మీద చెన్నై యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ గారి పర్యవేక్షణలో శ్రీ జి. శ్రీధర్ పిహెచ్.డి చేయుచున్నారు....................© 2017,www.logili.com All Rights Reserved.