భారతదేశంలో 70 శాతం ప్రజలకు వ్యవసాయమే ముఖ్య వృత్తి, ప్రజాబాహుళ్యం ఎక్కువగా గ్రామాలలో ఉంది, వ్యవసాయ పంటలతో బాటు, పశుపాలన కూడా కొనసాగిస్తారు. గ్రామీణ జీవితంలో పశుసంపాదకు విశిష్టమైన స్థానం ఉంది. హరిత విప్లవం తరువాత, శ్వేత విప్లవం వచ్చినా పాల ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. దీనికి కారణం, మంచి పాలచార కలిగిన మేలైన పశుజాతి అందరికి అందుబాటులో లేకపోవడం, పశుపాలనలో పెరిగిన ఖర్చులు, నాణ్యతగల పచ్చిమేతలు తగినంత ఉత్పత్తి చెయ్యలేకపోవడం. ప్రస్తుతం భారతదేశం పశుసంపదలో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉంది. మనకున్న స్వల్ప వనరులతో మేలైన అధికోత్పత్తినిచ్చే పోషక పుష్టి గల పచ్చిగ్రాసాలను సాగు చేస్తేనే కాని పశు ఉత్పాదకతను పెంచలేము.
అరుదైన పశుగ్రాసాల విజ్ఞానం సమగ్రంగా వివరించాలంటే కొన్ని వందల జర్నల్స్, గ్రంథాలు తిరగేయ్యాలి. డా రాజు మనకు బొత్తిగా ఏమి తెలియని విషయాలను శ్రమకూర్చి, లోతుగా పరిశీలించి మన ముందుంచారు. ఏయే పశుగ్రాసాలు ఎక్కడ పుట్టాయి? ఎలా మన ప్రాంతానికి చేరాయి? వాటి పోషక విలువలేమిటి అనే అంశాలను ఆసక్తికరంగా వివరించారు. ఆలస్యం ఎందుకు? చదివి ఆనందించండి. ఈ పుస్తకాన్ని రూపొందించిన డా రుద్రరాజు అల్పరాజు గారికి నా ప్రత్యేక కృతఙ్ఞతలు.
- వై వెంకటేశ్వరరావు
భారతదేశంలో 70 శాతం ప్రజలకు వ్యవసాయమే ముఖ్య వృత్తి, ప్రజాబాహుళ్యం ఎక్కువగా గ్రామాలలో ఉంది, వ్యవసాయ పంటలతో బాటు, పశుపాలన కూడా కొనసాగిస్తారు. గ్రామీణ జీవితంలో పశుసంపాదకు విశిష్టమైన స్థానం ఉంది. హరిత విప్లవం తరువాత, శ్వేత విప్లవం వచ్చినా పాల ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. దీనికి కారణం, మంచి పాలచార కలిగిన మేలైన పశుజాతి అందరికి అందుబాటులో లేకపోవడం, పశుపాలనలో పెరిగిన ఖర్చులు, నాణ్యతగల పచ్చిమేతలు తగినంత ఉత్పత్తి చెయ్యలేకపోవడం. ప్రస్తుతం భారతదేశం పశుసంపదలో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉంది. మనకున్న స్వల్ప వనరులతో మేలైన అధికోత్పత్తినిచ్చే పోషక పుష్టి గల పచ్చిగ్రాసాలను సాగు చేస్తేనే కాని పశు ఉత్పాదకతను పెంచలేము. అరుదైన పశుగ్రాసాల విజ్ఞానం సమగ్రంగా వివరించాలంటే కొన్ని వందల జర్నల్స్, గ్రంథాలు తిరగేయ్యాలి. డా రాజు మనకు బొత్తిగా ఏమి తెలియని విషయాలను శ్రమకూర్చి, లోతుగా పరిశీలించి మన ముందుంచారు. ఏయే పశుగ్రాసాలు ఎక్కడ పుట్టాయి? ఎలా మన ప్రాంతానికి చేరాయి? వాటి పోషక విలువలేమిటి అనే అంశాలను ఆసక్తికరంగా వివరించారు. ఆలస్యం ఎందుకు? చదివి ఆనందించండి. ఈ పుస్తకాన్ని రూపొందించిన డా రుద్రరాజు అల్పరాజు గారికి నా ప్రత్యేక కృతఙ్ఞతలు. - వై వెంకటేశ్వరరావు
© 2017,www.logili.com All Rights Reserved.