ఒక గాథ గురించి కె. శివారెడ్డి
నేనిప్పుడొక మహోపన్యాసం చేయగలను, డా|| వి. చంద్రశేఖరరావు గారి సాహిత్యం మీద. అంతగా యింకించుకున్నాను దాన్ని నాలోకి. లేదు, అతని సాహిత్యం నన్నంతగా ఇన్వాల్వ్ చేసుకుంది. చేసుకునే శక్తి దానికుంది. అతని తొలి కథలు జీవని దగ్గర నుంచి- ఈమధ్యనే అచ్చయిన ద్రోహవృక్షం దాకా అతని తొలి నవల ఐదు హంసలు దగ్గర నుంచి ఇప్పుడీ మూడో నవల నల్లమిరియం చెట్టు దాకా చాలా క్లోజ్, దగ్గరగా ఫాలో అవుతూ వస్తున్నా- "ఇక్కడ ఒక డిఫరెంట్ వాయిస్ వుంది, కొత్తశైలీ నిర్మాణాలతో కూడుకున్న వచన రచన వుంది; తప్పకుండా శ్రద్ధ పెట్టాల్సిన రచయిత " అని నేను అనుకున్న తర్వాతే అతన్ని శ్రద్ధగానూ, లోతుగానూ ఎప్పటికప్పుడు చదువుతూనే వున్నాను. అవసరమయినప్పుడు సంభాషణ జరుపుతూనే వున్నాను. ఎప్పుడచ్చయిన కథలు, అప్పుడు చదవటమే కాకుండా- ఇప్పుడు నల్ల మిరియం చెట్టు నవలకి 'ముందుమాట' అనే సాకుతో నాలుగు మాటలు రాద్దామనుకున్నప్పుడు- అతని మొత్తం సాహిత్యం చదవటం తప్పనిసరి అని భావించి డా॥ చంద్ర శేఖరరావుగారినడిగితే- నాలుగు కథాసంపుటాలు, మూడు నవలలు పంపించారు. నాలుగు కథాసంపుటాలు- జీవని- 1994, లెనిన్ ప్లేస్ - 1998, మాయలాంతరు 2003, ద్రోహవృక్షం- 2011; నవలలు- ఐదు హంసలు- 1999, ఆకుపచ్చని దేశం- 2009, నల్లమిరియం చెట్టు- 2011 కాలాను క్రమంలోనే చదివా. నాలుగు కథాసంపుటాలు ఒక్కోటి రెండుసార్లు, మొదటి నవల రెండుసార్లు, ఆకుప్పని దేశం, నల్లమిరియం చెట్టు మూడుసార్లు................
ఒక గాథ గురించి కె. శివారెడ్డి నేనిప్పుడొక మహోపన్యాసం చేయగలను, డా|| వి. చంద్రశేఖరరావు గారి సాహిత్యం మీద. అంతగా యింకించుకున్నాను దాన్ని నాలోకి. లేదు, అతని సాహిత్యం నన్నంతగా ఇన్వాల్వ్ చేసుకుంది. చేసుకునే శక్తి దానికుంది. అతని తొలి కథలు జీవని దగ్గర నుంచి- ఈమధ్యనే అచ్చయిన ద్రోహవృక్షం దాకా అతని తొలి నవల ఐదు హంసలు దగ్గర నుంచి ఇప్పుడీ మూడో నవల నల్లమిరియం చెట్టు దాకా చాలా క్లోజ్, దగ్గరగా ఫాలో అవుతూ వస్తున్నా- "ఇక్కడ ఒక డిఫరెంట్ వాయిస్ వుంది, కొత్తశైలీ నిర్మాణాలతో కూడుకున్న వచన రచన వుంది; తప్పకుండా శ్రద్ధ పెట్టాల్సిన రచయిత " అని నేను అనుకున్న తర్వాతే అతన్ని శ్రద్ధగానూ, లోతుగానూ ఎప్పటికప్పుడు చదువుతూనే వున్నాను. అవసరమయినప్పుడు సంభాషణ జరుపుతూనే వున్నాను. ఎప్పుడచ్చయిన కథలు, అప్పుడు చదవటమే కాకుండా- ఇప్పుడు నల్ల మిరియం చెట్టు నవలకి 'ముందుమాట' అనే సాకుతో నాలుగు మాటలు రాద్దామనుకున్నప్పుడు- అతని మొత్తం సాహిత్యం చదవటం తప్పనిసరి అని భావించి డా॥ చంద్ర శేఖరరావుగారినడిగితే- నాలుగు కథాసంపుటాలు, మూడు నవలలు పంపించారు. నాలుగు కథాసంపుటాలు- జీవని- 1994, లెనిన్ ప్లేస్ - 1998, మాయలాంతరు 2003, ద్రోహవృక్షం- 2011; నవలలు- ఐదు హంసలు- 1999, ఆకుపచ్చని దేశం- 2009, నల్లమిరియం చెట్టు- 2011 కాలాను క్రమంలోనే చదివా. నాలుగు కథాసంపుటాలు ఒక్కోటి రెండుసార్లు, మొదటి నవల రెండుసార్లు, ఆకుప్పని దేశం, నల్లమిరియం చెట్టు మూడుసార్లు................© 2017,www.logili.com All Rights Reserved.