నా జీవిత చరిత్రలో ఆ సంవత్సరానికి మెరుగు పెట్టిన ముసల్మాన్ కన్య అమీనా. అమీనాని తలుచుకున్నప్పుడల్లా, ఆహ్లాదకరమైన ఉదయోత్సా హానికి తోడ్పడే, పన్నీరు పువ్వు మార్దవమైన పరిమళం జ్ఞప్తికి వొస్తుంది. అదే నాజూకు, అదే మొండితనం, అదే స్నేహం.
అవి దినానికి యిరవైనాలుగు గంటలూ చాలని రోజులు. దొంగ సిక్ లీవు పెట్టి కాలేజీ ఎగకొట్టి దాక్కున్న రామ్మూర్తి, తాతా, భర్త దగ్గిర్నించి కాజువల్ లీవన్నా పెట్టకుండా శర్మకోసం వొచ్చిన సత్యా, నేనూ నలుగు రమూ ఆ మొండిగోడల ఇంట్లో, నేను స్కూలుకి వెళ్ళగానే, సోమరినైన నా అజాగ్రత్తనూ, నిర్లక్ష్యాన్ని సరితీసి, నా గదిని మళ్ళీ నివాసయోగ్యంగా చేసే 'జీవం' ప్రేమ ప్రతి వుదయమూ, సాయంత్రమూ నన్ను బుజ్జగించేది. కాని ప్రతిక్షణమూ, ఎడతెరపిలేక హృదయకవాటాన్ని పెద్ద అరుపులతో తట్టే వివిధాకర్షణలతో నీ మృదుదృష్టుల్నీ, నీ మధురగీతాల్నీ, నీవు నా పక్కమీద వదిలిపొయ్యే చామంతిరేకుల్నీ, మరచాను, 'జీవం' నన్ను క్షమించు........................
నా జీవిత చరిత్రలో ఆ సంవత్సరానికి మెరుగు పెట్టిన ముసల్మాన్ కన్య అమీనా. అమీనాని తలుచుకున్నప్పుడల్లా, ఆహ్లాదకరమైన ఉదయోత్సా హానికి తోడ్పడే, పన్నీరు పువ్వు మార్దవమైన పరిమళం జ్ఞప్తికి వొస్తుంది. అదే నాజూకు, అదే మొండితనం, అదే స్నేహం. అవి దినానికి యిరవైనాలుగు గంటలూ చాలని రోజులు. దొంగ సిక్ లీవు పెట్టి కాలేజీ ఎగకొట్టి దాక్కున్న రామ్మూర్తి, తాతా, భర్త దగ్గిర్నించి కాజువల్ లీవన్నా పెట్టకుండా శర్మకోసం వొచ్చిన సత్యా, నేనూ నలుగు రమూ ఆ మొండిగోడల ఇంట్లో, నేను స్కూలుకి వెళ్ళగానే, సోమరినైన నా అజాగ్రత్తనూ, నిర్లక్ష్యాన్ని సరితీసి, నా గదిని మళ్ళీ నివాసయోగ్యంగా చేసే 'జీవం' ప్రేమ ప్రతి వుదయమూ, సాయంత్రమూ నన్ను బుజ్జగించేది. కాని ప్రతిక్షణమూ, ఎడతెరపిలేక హృదయకవాటాన్ని పెద్ద అరుపులతో తట్టే వివిధాకర్షణలతో నీ మృదుదృష్టుల్నీ, నీ మధురగీతాల్నీ, నీవు నా పక్కమీద వదిలిపొయ్యే చామంతిరేకుల్నీ, మరచాను, 'జీవం' నన్ను క్షమించు........................© 2017,www.logili.com All Rights Reserved.