దైవమిచ్చిన భార్య
ఆ రోజుల్లో నేను సుందరవరం లోవరు సెకండరీ స్కూలులో చదువు కొనే వాడిని. నాకూ, స్నేహితులకీ యేది చూసినా నవ్వుగా, ఆనందంగా వుండేది. కాలువ వొడ్డున మామిడి కాయలు కొట్టుకు తినడం, బల్ల కట్టు మీద యెక్కి ఆ వొడ్డుకీ యీ వొడ్డుకీ తిరగడం చాలా సరదా మాకు. ఆ బల్ల కట్టువాడు మమ్మల్ని తిట్టిన కొద్దీ మాకు సంతోషం. చెంచువాళ్ళ గాడిద అట్లా వస్తేచాలు, అరఫర్లాంగు దూరం దాన్ని తరిమితే గాని వదిలే వాళ్ళం కాదు. కొత్త కుర్రవాడెవడన్నా కనబడగానే వాణ్ణి కేకవేసి పిలిచి వెక్కిరించి తిట్టి, అధిక ప్రయత్నం మీద వాడికి కోపం తెప్పించి వాడిచేత తిట్టించుకొని, వాణ్ణి తన్ని అప్పుడప్పుడు తన్నులు కూడా తిని, ఇన్ని పాట్లు పడేవాళ్ళం. కాని పేడతట్ట నెత్తిమీద పెట్టుకొని ఒక పిల్ల గేదెని తోలుకుంటూ వొచ్చేది. ఆ గేదెమీద యెక్కి పరిగెత్తించి ఆ పిల్లని ఏడిపించాలని యెంతో వుండేది. కాని ఆ ధైర్యం మాలో వొక్కడికీ వుండేది కాదు. అదే మొగకుర్రాడై తేనా! ఆఖరికి ఒక రోజు యెక్కడానికి ఆ గేదె దగ్గరికి వెళ్ళాను. ఆ పిల్ల నాకేసి చూసింది. ఆ చూపులో నా హృదయానికేదో కనిపించింది; సిగ్గుపడి మాట్లాడకుండా వెనక్కి వొచ్చేశాను......................
దైవమిచ్చిన భార్య ఆ రోజుల్లో నేను సుందరవరం లోవరు సెకండరీ స్కూలులో చదువు కొనే వాడిని. నాకూ, స్నేహితులకీ యేది చూసినా నవ్వుగా, ఆనందంగా వుండేది. కాలువ వొడ్డున మామిడి కాయలు కొట్టుకు తినడం, బల్ల కట్టు మీద యెక్కి ఆ వొడ్డుకీ యీ వొడ్డుకీ తిరగడం చాలా సరదా మాకు. ఆ బల్ల కట్టువాడు మమ్మల్ని తిట్టిన కొద్దీ మాకు సంతోషం. చెంచువాళ్ళ గాడిద అట్లా వస్తేచాలు, అరఫర్లాంగు దూరం దాన్ని తరిమితే గాని వదిలే వాళ్ళం కాదు. కొత్త కుర్రవాడెవడన్నా కనబడగానే వాణ్ణి కేకవేసి పిలిచి వెక్కిరించి తిట్టి, అధిక ప్రయత్నం మీద వాడికి కోపం తెప్పించి వాడిచేత తిట్టించుకొని, వాణ్ణి తన్ని అప్పుడప్పుడు తన్నులు కూడా తిని, ఇన్ని పాట్లు పడేవాళ్ళం. కాని పేడతట్ట నెత్తిమీద పెట్టుకొని ఒక పిల్ల గేదెని తోలుకుంటూ వొచ్చేది. ఆ గేదెమీద యెక్కి పరిగెత్తించి ఆ పిల్లని ఏడిపించాలని యెంతో వుండేది. కాని ఆ ధైర్యం మాలో వొక్కడికీ వుండేది కాదు. అదే మొగకుర్రాడై తేనా! ఆఖరికి ఒక రోజు యెక్కడానికి ఆ గేదె దగ్గరికి వెళ్ళాను. ఆ పిల్ల నాకేసి చూసింది. ఆ చూపులో నా హృదయానికేదో కనిపించింది; సిగ్గుపడి మాట్లాడకుండా వెనక్కి వొచ్చేశాను......................© 2017,www.logili.com All Rights Reserved.