శ్రీకృష్ణదేవరాయల కవితా ప్రతిభకు, భక్తితత్పరతకు, లోకజ్ఞతకు, సామాజిక పరిశీలన నైపుణ్యానికి నిదర్శనం 'ఆముక్తమాల్యద' ప్రబంధం. పాఠకులకు తాత్విక చింతన కలిగించి, సచ్ఛీలం వైపు మనసును మళ్ళిస్తుందీ రచన. గోదా రంగనాథుల కల్యాణం ఇందులో ప్రధానవస్తువు కాగా, ఖాండిక్య కేశిధ్వజుల ఇతివృత్తం రాచరికపు వ్యవస్థలోని ఎన్నో విశేషాలు తెలియజేస్తుంది. దీంతో పాటు రాజనీతి బోధ, ప్రకృతి వర్ణనలు, వైష్ణవ భక్తి... ఇంకా మరెన్నో విశేషాలు ఈ ప్రబంధంలో ఉన్నాయి. వీటన్నిటినీ పాఠకులకు సులభశైలిలో అందిస్తుందీ గ్రంథం. మూలగ్రంథంలోని ప్రతి పద్యానికి వాడుకభాషలో చక్కటి వివరణ, దానితో పాటు సందర్భానికి అనుగుణంగా చేసిన విశ్లేషణతో ఈ గ్రంథం సాగుతుంది. సాహిత్యప్రియులతో పాటు పరిశోధకులకు, అధ్యాపకులకు ఈ గ్రంథం ఎంతో ఉపయోగిస్తుంది.
సనాతన సాహిత్యాన్ని వీలైనంత వాడుకభాషలో నేటితరానికి అందించే ప్రయత్నంలో భాగంగా ఆముక్తమాల్యదతో పాటు మనుచరిత్ర, శృంగార నైషధం, వసుచరిత్ర, పాండురంగ మాహాత్మ్యం, పారిజాతాపహరణం కావ్యాలు కూడా ప్రచురించాము.
శ్రీకృష్ణదేవరాయల కవితా ప్రతిభకు, భక్తితత్పరతకు, లోకజ్ఞతకు, సామాజిక పరిశీలన నైపుణ్యానికి నిదర్శనం 'ఆముక్తమాల్యద' ప్రబంధం. పాఠకులకు తాత్విక చింతన కలిగించి, సచ్ఛీలం వైపు మనసును మళ్ళిస్తుందీ రచన. గోదా రంగనాథుల కల్యాణం ఇందులో ప్రధానవస్తువు కాగా, ఖాండిక్య కేశిధ్వజుల ఇతివృత్తం రాచరికపు వ్యవస్థలోని ఎన్నో విశేషాలు తెలియజేస్తుంది. దీంతో పాటు రాజనీతి బోధ, ప్రకృతి వర్ణనలు, వైష్ణవ భక్తి... ఇంకా మరెన్నో విశేషాలు ఈ ప్రబంధంలో ఉన్నాయి. వీటన్నిటినీ పాఠకులకు సులభశైలిలో అందిస్తుందీ గ్రంథం. మూలగ్రంథంలోని ప్రతి పద్యానికి వాడుకభాషలో చక్కటి వివరణ, దానితో పాటు సందర్భానికి అనుగుణంగా చేసిన విశ్లేషణతో ఈ గ్రంథం సాగుతుంది. సాహిత్యప్రియులతో పాటు పరిశోధకులకు, అధ్యాపకులకు ఈ గ్రంథం ఎంతో ఉపయోగిస్తుంది. సనాతన సాహిత్యాన్ని వీలైనంత వాడుకభాషలో నేటితరానికి అందించే ప్రయత్నంలో భాగంగా ఆముక్తమాల్యదతో పాటు మనుచరిత్ర, శృంగార నైషధం, వసుచరిత్ర, పాండురంగ మాహాత్మ్యం, పారిజాతాపహరణం కావ్యాలు కూడా ప్రచురించాము.© 2017,www.logili.com All Rights Reserved.