భగవాన్ శ్రీ రమణ మహర్పుల సూచనలు, ఉపదేశాల గురించి పర్యాలోచన చేయడం ఎంతైనా మంచిది. అవసరం కూడాను. అటువంటి యోచన ఎటువంటి ఆధ్యాత్మిక మార్గం గురించి అయినా అవసరమే. రమణుని విషయంలో అటువంటి యోచన మరింత ఎక్కవ అవసరం. సాధనకు - లక్ష్యానికి మధ్య దూరం లేదు. అలాగే మెట్లు, అంతస్తులు లేవు. రమణుని మార్గం “ఆత్మవిచారణ”. అది అత్యంత సులువైనది - సూటైనది - సహజమైనది. ఆ మార్గంలో “ఇది చెయ్యి, అది చెయ్యకు” అనే పద్ధతి లేదు. నిర్ణీత, నిబంధనలేవీ లేవు. సహజానుభవ స్వరూప - స్వభావాలు, వాటి స్థితిగతులు, సహజానందం సాధనకాలమంతా ఒకే విధంగా వుంటుంది. సాధనాకాలంలో ఆ ఆనందానుభవ స్థితినుంచి - సాధకుడు అప్పుడప్పుడు బైటికి రావడం, మళ్ళా లోపలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ స్థితిలో స్థిరంగా, నిరాటంకంగా, నిరభ్యంతరంగా నిలవడమే - గమ్యం చేరడం.
రమణుని సూటిమార్గాన సాధన చేస్తే, ఎదురయ్యే సమస్యల్ని లేక అందులో అంతర్లీనంగా వున్న విషయాల్ని అవగాహన చేసుకునేందుకు సరైన అంతర్వీక్షణ అవసరం, ముఖ్యం కూడాను. -
“అంతర్వీక్షణ” అనే ఈ గ్రంథంలోని అంశాలపై పాఠకుని శ్రద్ధ మళ్ళితే అప్పుడు అతనికి ఈ గ్రంథంలోని అభ్యాస పద్ధతి పూర్తిగా అర్థమౌతుంది."
భగవాన్ శ్రీ రమణ మహర్పుల సూచనలు, ఉపదేశాల గురించి పర్యాలోచన చేయడం ఎంతైనా మంచిది. అవసరం కూడాను. అటువంటి యోచన ఎటువంటి ఆధ్యాత్మిక మార్గం గురించి అయినా అవసరమే. రమణుని విషయంలో అటువంటి యోచన మరింత ఎక్కవ అవసరం. సాధనకు - లక్ష్యానికి మధ్య దూరం లేదు. అలాగే మెట్లు, అంతస్తులు లేవు. రమణుని మార్గం “ఆత్మవిచారణ”. అది అత్యంత సులువైనది - సూటైనది - సహజమైనది. ఆ మార్గంలో “ఇది చెయ్యి, అది చెయ్యకు” అనే పద్ధతి లేదు. నిర్ణీత, నిబంధనలేవీ లేవు. సహజానుభవ స్వరూప - స్వభావాలు, వాటి స్థితిగతులు, సహజానందం సాధనకాలమంతా ఒకే విధంగా వుంటుంది. సాధనాకాలంలో ఆ ఆనందానుభవ స్థితినుంచి - సాధకుడు అప్పుడప్పుడు బైటికి రావడం, మళ్ళా లోపలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ స్థితిలో స్థిరంగా, నిరాటంకంగా, నిరభ్యంతరంగా నిలవడమే - గమ్యం చేరడం. రమణుని సూటిమార్గాన సాధన చేస్తే, ఎదురయ్యే సమస్యల్ని లేక అందులో అంతర్లీనంగా వున్న విషయాల్ని అవగాహన చేసుకునేందుకు సరైన అంతర్వీక్షణ అవసరం, ముఖ్యం కూడాను. - “అంతర్వీక్షణ” అనే ఈ గ్రంథంలోని అంశాలపై పాఠకుని శ్రద్ధ మళ్ళితే అప్పుడు అతనికి ఈ గ్రంథంలోని అభ్యాస పద్ధతి పూర్తిగా అర్థమౌతుంది."© 2017,www.logili.com All Rights Reserved.