రచయిత అన్నవాడు వోల్టేర్ ప్రస్తావించిన 'గుడ్ బ్రహ్మిన్' వంటివాడు. తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించకుండా ఉండలేడు. వ్యధ చెందకుండా ఉ౦డలేడు. ఓ అమాయక వృద్దురాలిలా తన గోడేదో తను చూసుకుంటూ హాయిగా గడపలేడు. తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆందోళన చెందుతాడు. తన చుట్టూ ఉన్నవాళ్ళలో చైతన్యం కలిగించడానికి నడుం కడతాడు. "రాజకీయవేత్త సామాజిక జీవితంలో ఏయే మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తాడో, తదనుగుణమైన మానసిక పరివర్తన మనుషుల హృదయాలలో కలిగించడానికి రచయిత కృషి చేస్తాడు".
"ఈ కథల్లో దేన్ని తీసుకన్నా ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈనాటి సమాజం ఎలా ఉన్నదీ, ఈ సమస్యల సుడిగుండంలో ఎలా విలవిల్లాడుతున్నదీ మన హృదయం స్పందించేటట్టు ఈ కథలు ప్రతిఫలింపచేస్తాయి."
"ఈ రచయిత కథనరీతికి 'వ్యంగ్యం' బలంగా ఉపయోగపడింది. అందుకని వీటిని వ్యంగ్యకథలనో, హాస్యకథలనో చెప్పడానికి వీల్లేదు. వీటిలోని వ్యంగ్యం విషాదంతో కూడుకున్నటువంటిది. ఒక్కమాటలో చెప్పాలంటే మనుషుల పట్ల - వ్యవస్థ చేస్తున్న క్రూరపరిహాసాన్ని ఈ కథలు చిత్రించాయి. ఒకరి జీవితం, ఒకరి వేదన, ఒకరి ఆరాటం మరొకరికి నవ్వులాటగా మారిపోవడం విషాదం. ఆ విషాదాన్ని చిత్రించడానికి వ్యంగ్యాన్ని సాధనంగా చేసుకోవడంలోనే రచయిత నేర్పు కనిపిస్తుంది. కథని ఎత్తుకోవడంలోనూ, నడిపించడంలోనూ, సంభాషణల్లోనూఈ వ్యంగ్యం ఉండీ లేనట్టుగా ఉంటుంది. అందువల్లనే వీటిని హాస్య కథలని చెప్పడం లేదు. నవ్వించడం కోసం రాసిన వ్యంగ్యం కాదు ఇది. జీవితంలోని విషాదభరితమైన సన్నివేశాల చిత్రీకరణకు రచయిత వ్యంగ్యాన్ని ఆశ్రయించారు. ఈ కథలు చదువుతున్న క్రమంలో అక్కడక్కడ రావిశాస్త్రి, కె.ఎన్.వై. పతంజలి గుర్తుకొస్తారు. ఈ రచయిత మీద వారి ప్రభావం ఉందనిపిస్తోంది.
రచయిత అన్నవాడు వోల్టేర్ ప్రస్తావించిన 'గుడ్ బ్రహ్మిన్' వంటివాడు. తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించకుండా ఉండలేడు. వ్యధ చెందకుండా ఉ౦డలేడు. ఓ అమాయక వృద్దురాలిలా తన గోడేదో తను చూసుకుంటూ హాయిగా గడపలేడు. తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆందోళన చెందుతాడు. తన చుట్టూ ఉన్నవాళ్ళలో చైతన్యం కలిగించడానికి నడుం కడతాడు. "రాజకీయవేత్త సామాజిక జీవితంలో ఏయే మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తాడో, తదనుగుణమైన మానసిక పరివర్తన మనుషుల హృదయాలలో కలిగించడానికి రచయిత కృషి చేస్తాడు". "ఈ కథల్లో దేన్ని తీసుకన్నా ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈనాటి సమాజం ఎలా ఉన్నదీ, ఈ సమస్యల సుడిగుండంలో ఎలా విలవిల్లాడుతున్నదీ మన హృదయం స్పందించేటట్టు ఈ కథలు ప్రతిఫలింపచేస్తాయి." "ఈ రచయిత కథనరీతికి 'వ్యంగ్యం' బలంగా ఉపయోగపడింది. అందుకని వీటిని వ్యంగ్యకథలనో, హాస్యకథలనో చెప్పడానికి వీల్లేదు. వీటిలోని వ్యంగ్యం విషాదంతో కూడుకున్నటువంటిది. ఒక్కమాటలో చెప్పాలంటే మనుషుల పట్ల - వ్యవస్థ చేస్తున్న క్రూరపరిహాసాన్ని ఈ కథలు చిత్రించాయి. ఒకరి జీవితం, ఒకరి వేదన, ఒకరి ఆరాటం మరొకరికి నవ్వులాటగా మారిపోవడం విషాదం. ఆ విషాదాన్ని చిత్రించడానికి వ్యంగ్యాన్ని సాధనంగా చేసుకోవడంలోనే రచయిత నేర్పు కనిపిస్తుంది. కథని ఎత్తుకోవడంలోనూ, నడిపించడంలోనూ, సంభాషణల్లోనూఈ వ్యంగ్యం ఉండీ లేనట్టుగా ఉంటుంది. అందువల్లనే వీటిని హాస్య కథలని చెప్పడం లేదు. నవ్వించడం కోసం రాసిన వ్యంగ్యం కాదు ఇది. జీవితంలోని విషాదభరితమైన సన్నివేశాల చిత్రీకరణకు రచయిత వ్యంగ్యాన్ని ఆశ్రయించారు. ఈ కథలు చదువుతున్న క్రమంలో అక్కడక్కడ రావిశాస్త్రి, కె.ఎన్.వై. పతంజలి గుర్తుకొస్తారు. ఈ రచయిత మీద వారి ప్రభావం ఉందనిపిస్తోంది.
© 2017,www.logili.com All Rights Reserved.