బ్రాహ్మణిజంపై 'శూద్రుని' తిరుగుబాటు
'ప్రాచీన యుగంలో బుద్ధుడు, మధ్య యుగంలో కబీరు, ఆధునిక యుగంలో మహాత్మ జోతిరావు పూలేలు నాకు గురువులు' అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం నిరంతరం తపించి, వారి కోసం పోరాడిన భారత రాజ్యాంగ నిర్మాత 'అంబేద్కర్ కే పూలే గురువు అంటే ఆయన ఎంతటి మహానుభావుడో అర్ధం చేసుకోవచ్చు.
మహారాష్ట్రలోని పూనేలో జన్మించిన 'పూలే' మొదటి నుంచి అభ్యుదయవాది, సంస్కరణ వాది, విజ్ఞానం లేక మూఢ నమ్మకాలతో బతికే నాటి ప్రజల్లో చైతన్యం కోసం పోరాడిన మేధావి. బ్రాహ్మణుల ఆధిపత్యధోరణకీ, మతం పేరుతో వారు చేస్తోన్న అకృత్యాలకు ఎదురొడ్డి పోరాడిన కర్మయోగి. దాదాపు 150 సంవత్సరాల క్రితం అంటే అంతగా విజ్ఞానం లేని రోజుల్లోనే ఆయన మతతత్వశక్తుల మత దురహంకారంపై మడమతిప్పని పోరాటం చేశారు. నాటి సమాజంలో ఉన్న బలహీనతలను అవకాశం తీసుకుని ఆయనపై, ఆయన కుటుంబంపై నాటి బ్రాహ్మణ పెద్దలు కక్ష సాధించినా, హత్యాప్రయత్నాలు చేసినా ఆయన జంక లేదు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, మహిళల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం ఆధునిక భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘట్టమే.
నాటి హిందూమతశక్తుల చేతిలో శూద్ర, అతిశూద్రులు పడిన బాధలను ఆయన మరాఠీలో 'గులాంగిరీ' పేరుతో రాశారు. ఈ గ్రంథం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది. శూద్రులు, అతిశూద్రుల నీడలు పడితేనే తాము మైలపడిపోతామని, వాళ్ల చెప్పులను నెత్తిన మోయించి, బతికి ఉండగానే భవనాల పునాదుల్లో అతిశూద్రులను పూడ్చిన నాటి హిందూమత శక్తుల దుర్మార్గాలను తలచుకుంటునే కళ్లమ్మటి నీళ్లు కారుతాయి. దేవుడి విషయంలో హిందూమత గ్రంధకర్తలు రాసిన పురాణాలను కట్టుకథలుగా శాస్త్రీయంగా తేల్చిన గొప్ప గ్రంధకర్త.
నాటి బ్రాహ్మణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర ఉన్నత ఉద్యోగుల చేతిలో హింసకు, మోసాలకు గురైన శూద్ర, అతిశూద్రుల బాధలను ఆయన కళ్లకు కట్టినట్లు మహాత్మ జోతిబాపూలే బానిసత్వం..............
బ్రాహ్మణిజంపై 'శూద్రుని' తిరుగుబాటు 'ప్రాచీన యుగంలో బుద్ధుడు, మధ్య యుగంలో కబీరు, ఆధునిక యుగంలో మహాత్మ జోతిరావు పూలేలు నాకు గురువులు' అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం నిరంతరం తపించి, వారి కోసం పోరాడిన భారత రాజ్యాంగ నిర్మాత 'అంబేద్కర్ కే పూలే గురువు అంటే ఆయన ఎంతటి మహానుభావుడో అర్ధం చేసుకోవచ్చు. మహారాష్ట్రలోని పూనేలో జన్మించిన 'పూలే' మొదటి నుంచి అభ్యుదయవాది, సంస్కరణ వాది, విజ్ఞానం లేక మూఢ నమ్మకాలతో బతికే నాటి ప్రజల్లో చైతన్యం కోసం పోరాడిన మేధావి. బ్రాహ్మణుల ఆధిపత్యధోరణకీ, మతం పేరుతో వారు చేస్తోన్న అకృత్యాలకు ఎదురొడ్డి పోరాడిన కర్మయోగి. దాదాపు 150 సంవత్సరాల క్రితం అంటే అంతగా విజ్ఞానం లేని రోజుల్లోనే ఆయన మతతత్వశక్తుల మత దురహంకారంపై మడమతిప్పని పోరాటం చేశారు. నాటి సమాజంలో ఉన్న బలహీనతలను అవకాశం తీసుకుని ఆయనపై, ఆయన కుటుంబంపై నాటి బ్రాహ్మణ పెద్దలు కక్ష సాధించినా, హత్యాప్రయత్నాలు చేసినా ఆయన జంక లేదు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, మహిళల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం ఆధునిక భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘట్టమే. నాటి హిందూమతశక్తుల చేతిలో శూద్ర, అతిశూద్రులు పడిన బాధలను ఆయన మరాఠీలో 'గులాంగిరీ' పేరుతో రాశారు. ఈ గ్రంథం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది. శూద్రులు, అతిశూద్రుల నీడలు పడితేనే తాము మైలపడిపోతామని, వాళ్ల చెప్పులను నెత్తిన మోయించి, బతికి ఉండగానే భవనాల పునాదుల్లో అతిశూద్రులను పూడ్చిన నాటి హిందూమత శక్తుల దుర్మార్గాలను తలచుకుంటునే కళ్లమ్మటి నీళ్లు కారుతాయి. దేవుడి విషయంలో హిందూమత గ్రంధకర్తలు రాసిన పురాణాలను కట్టుకథలుగా శాస్త్రీయంగా తేల్చిన గొప్ప గ్రంధకర్త. నాటి బ్రాహ్మణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర ఉన్నత ఉద్యోగుల చేతిలో హింసకు, మోసాలకు గురైన శూద్ర, అతిశూద్రుల బాధలను ఆయన కళ్లకు కట్టినట్లు మహాత్మ జోతిబాపూలే బానిసత్వం..............© 2017,www.logili.com All Rights Reserved.