నిజానికి రవి ప్రకాష్ కి పరిచయ వాక్యాలతో పని లేదు. ఎందుకంటే 33 యేళ్ళుగా కవిత్వం రాస్తున్నాడు. తెలుగు సాహితి జగత్తుకి సుపరిచితుడు కూడాను! సమస్తలోక్కన్ని ప్రేమిస్తాడు. కవిత్వ మంటే ప్రణమిస్తాడు. తన ప్రతి కవితలోని కవిత్వమే తొణికిస లాడుతుంటుంది. ప్రతి వాక్యాన్ని కవితాత్మకం చేసే ఐoద్రజాలిక విద్య తెలిసిన వాడతాను.
33 యేళ్ళుగా కవిత్వం రాస్తూ కవిగా తనదైన గొంతుని వినిపిస్తున్న వాడికి ముందు మాటలతో పరిచయ వాక్యల్తో పనిలేదు. అయినా కూడా రవిప్రకాష్ - "నువ్వు రాయాలి " అంటూ నన్నొకింత ఇబ్బందిలో పడేసాడు. 1985 ప్రాంతంల్లో కాబోలు తాను జె. ఎన్. టి. యు. కాకినాడలో సివిల్ ఇంజినీరింగ్ చదివే రోజుల్లో ఒక రోజు మా మెడికల్ కాలేజీ మేన్స్ హాస్టల్ కి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో రవిప్రకాష్ అంటే అనేక ప్రశ్నల సందోహం. అనేకాకనేక సందేహాలు సమాహారం! కవిత్వమంటే అపారమైన ప్రేమ. తాను ఇంజినీరింగ్ నేను మెడిసిన్ చదువుతున్నప్పటికీ మా ఇద్దరికి ఇష్టమైన సబ్జెక్టు - పోయెట్రీ యే ! అది క్లాస్ రూముల్లోనో కాలేజీ ప్రాంగణంలోనే ఒకరు బోధించేది కాదు. జీవితపు పాఠాల్లాగే ఎవరికీ వారు నేర్చుకునేది.
- ఆకెళ్ళ రవిప్రకాష్