సహజమైన ప్రతిభాపాటవాలతో గొప్ప సృజనాత్మక రచయితగా సాహిత్యంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగల్గిన బోయ జంగయ్య కవి, కథకుడు, నవలా రచయిత, వ్యాసకర్త. దళిత చైతన్యం, అంధ మూఢవిశ్వాసాల పట్ల తిరస్కారం, శాస్త్రీయ దృక్పథంగా సమన్వయంగా సాగిన కథానికల సమాహారం ఈ కథా సంపుటి. పారిశ్రామికీకరణ కారణంగా పచ్చని పంట పొలాలతో కళకళలాడే పల్లెటూర్లు మాయమవుతున్న విషాద దృశ్యాలు, దళిత జీవన వాస్తవికత, దొంగ స్వాముల బాబాల ఆకృత్యాల చిత్రణతో విస్తరించిన ఈ కథానికలు స్పూర్తిదాయకాలు.
అన్యాయాలు, అక్రమాలను కళ్ళకు కట్టినట్టు చిత్రించటమే కాకుండా వాటిని ప్రతిఘటిస్తూ ఉద్యమించాలని అంతస్సూత్రంగా చెప్పిన కథానికలివి. ఈ అసమా సమాజంలో వివక్ష దోపిడీ పీడనలకు గురవుతున్న అణగారిన వర్గాలకు ఇవి ప్రతినిథ్య కథలు. క్లుప్తత, నాటకీయత ప్రధాన లక్షణాలు కాగా సూటిగా స్పష్టంగా పాఠకుడి మదిలోకి హృదిలోకి దూసుకుపోయే ఈ కథానికలు బోయ జంగయ్య జీవితానుభవాలే!
సహజమైన ప్రతిభాపాటవాలతో గొప్ప సృజనాత్మక రచయితగా సాహిత్యంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగల్గిన బోయ జంగయ్య కవి, కథకుడు, నవలా రచయిత, వ్యాసకర్త. దళిత చైతన్యం, అంధ మూఢవిశ్వాసాల పట్ల తిరస్కారం, శాస్త్రీయ దృక్పథంగా సమన్వయంగా సాగిన కథానికల సమాహారం ఈ కథా సంపుటి. పారిశ్రామికీకరణ కారణంగా పచ్చని పంట పొలాలతో కళకళలాడే పల్లెటూర్లు మాయమవుతున్న విషాద దృశ్యాలు, దళిత జీవన వాస్తవికత, దొంగ స్వాముల బాబాల ఆకృత్యాల చిత్రణతో విస్తరించిన ఈ కథానికలు స్పూర్తిదాయకాలు. అన్యాయాలు, అక్రమాలను కళ్ళకు కట్టినట్టు చిత్రించటమే కాకుండా వాటిని ప్రతిఘటిస్తూ ఉద్యమించాలని అంతస్సూత్రంగా చెప్పిన కథానికలివి. ఈ అసమా సమాజంలో వివక్ష దోపిడీ పీడనలకు గురవుతున్న అణగారిన వర్గాలకు ఇవి ప్రతినిథ్య కథలు. క్లుప్తత, నాటకీయత ప్రధాన లక్షణాలు కాగా సూటిగా స్పష్టంగా పాఠకుడి మదిలోకి హృదిలోకి దూసుకుపోయే ఈ కథానికలు బోయ జంగయ్య జీవితానుభవాలే!© 2017,www.logili.com All Rights Reserved.