ఈ కథలన్నీ చదివి కాసేపు మౌనంగా ఉండిపోయాను...
ఏదన్నా ఒక ప్రభావవంతమైన రచన చదివినపుడు అది మనలో కలిగించే ఆలోచనో, ఉద్వేగమో, అయిష్టమో - కొద్దిసేపు గానీ, కొన్ని రోజులు గానీ వెంటాడుతుంది. బర్మా కేంపు కథలు చదివాక మనసు నిండుగా ప్రవహిస్తున్నది ఏదో గుర్తు పట్టడానికి మౌనాన్ని ఆశ్రయించాను. కాసేపు నెమరువేసుకున్నాక ఆ ప్రవాహాన్ని గుర్తుపట్టాను.
అది కాందిశీకుల జీవితం.
ఆ జీవితం బర్మాకేంపు కావొచ్చు, మరో ప్రాంతం కావొచ్చు, మరో దేశం కావొచ్చు. కాందిశీకుల జీవితం ఎక్కడైనా కొద్దిమార్పులతో ఇంతే ఉంటుంది. కానీ దాన్ని అక్షరాల్లోకి ఒంపుతున్న రచయితలకి వైవిధ్యం తెలిసి ఉండాలి, విస్తృతి అర్థం కావాలి. ఎంతగా అంటే జీవితమంత లోతు తెలియాలి. అది తెలియాలంటే జీవితానికి ఉండే సమస్త వర్ణాలూ తెలిసి ఉండాలి. దానికి స్థానీయత జత గూడాలి. ఇవన్నీ ఉన్నా కూడా చదివే పాఠకులు పైవాటిని గుర్తు పట్టగలిగితేనే పఠనానుభవం వేరుగా
ఉంటుంది. కానీ అనంత వైవిధ్యం కన్నా దుఃఖానికి, బీభత్సానికి, దుర్మార్గానికి, కష్టాలకి రీడర్షిప్ ఎక్కువ. తమ ఉద్వేగాలను కూడా పాత్రలకి ఆవహింపజేసి చదివేవారిని గిల్లోకి నెట్టే రచయితలకి మన చుట్టూ కొదవ లేదు. జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో అంతకుమించిన సెలబ్రేషన్ ఉంటుంది. నాణ్యంగా జీవించడానికి మనుషులు ప్రతి క్షణమూ పడే తపన ఉంటుంది....................
కప్పల బడి గుంటడే ఈ కథలు రాసింది ఈ కథలన్నీ చదివి కాసేపు మౌనంగా ఉండిపోయాను... ఏదన్నా ఒక ప్రభావవంతమైన రచన చదివినపుడు అది మనలో కలిగించే ఆలోచనో, ఉద్వేగమో, అయిష్టమో - కొద్దిసేపు గానీ, కొన్ని రోజులు గానీ వెంటాడుతుంది. బర్మా కేంపు కథలు చదివాక మనసు నిండుగా ప్రవహిస్తున్నది ఏదో గుర్తు పట్టడానికి మౌనాన్ని ఆశ్రయించాను. కాసేపు నెమరువేసుకున్నాక ఆ ప్రవాహాన్ని గుర్తుపట్టాను. అది కాందిశీకుల జీవితం. ఆ జీవితం బర్మాకేంపు కావొచ్చు, మరో ప్రాంతం కావొచ్చు, మరో దేశం కావొచ్చు. కాందిశీకుల జీవితం ఎక్కడైనా కొద్దిమార్పులతో ఇంతే ఉంటుంది. కానీ దాన్ని అక్షరాల్లోకి ఒంపుతున్న రచయితలకి వైవిధ్యం తెలిసి ఉండాలి, విస్తృతి అర్థం కావాలి. ఎంతగా అంటే జీవితమంత లోతు తెలియాలి. అది తెలియాలంటే జీవితానికి ఉండే సమస్త వర్ణాలూ తెలిసి ఉండాలి. దానికి స్థానీయత జత గూడాలి. ఇవన్నీ ఉన్నా కూడా చదివే పాఠకులు పైవాటిని గుర్తు పట్టగలిగితేనే పఠనానుభవం వేరుగా ఉంటుంది. కానీ అనంత వైవిధ్యం కన్నా దుఃఖానికి, బీభత్సానికి, దుర్మార్గానికి, కష్టాలకి రీడర్షిప్ ఎక్కువ. తమ ఉద్వేగాలను కూడా పాత్రలకి ఆవహింపజేసి చదివేవారిని గిల్లోకి నెట్టే రచయితలకి మన చుట్టూ కొదవ లేదు. జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో అంతకుమించిన సెలబ్రేషన్ ఉంటుంది. నాణ్యంగా జీవించడానికి మనుషులు ప్రతి క్షణమూ పడే తపన ఉంటుంది....................© 2017,www.logili.com All Rights Reserved.