1936లో వెలువడిన 'కూలీ' శ్రీ ఆనంద్ రచించిన నవలలో రెండవది.
ఇది రష్యన్, జర్మన్, ఫ్రెంచి మొదలైన విదేశీయ భాషలలోనికి అనువదింపబడి
పాఠకుల మన్ననలను పొందిన నవల. ఈ నవలలో ప్రధానపాత్ర 'మునూ' అనే ఒక కూలీ. నిరుపేద రైతుకుటుంబంలో పుట్టి, వున్న ఆ కాస్తభూమి భూస్వామి
ఏనాడో అపహరించగా తను పుట్టినగడ్డ ఒదిలి పొట్ట చేత్తో పట్టుకొని, పట్టెడన్నం కోసం పడరాని పాట్లు పడుతూ ఒక ఇంటి నౌకరుగా, ఫ్యాక్టరీ కార్మికునిగా,
చివరకు రిక్షాకూలీగా అనేక కష్టాలకు లోనయిన 'మునూ దుఃఖమయ జీవిత విముక్తికై, సుసంఘటిత పోరాటమే మారమని ఈ నవలలో ప్రతిపాదింపబడింది. కథానిర్వహణలో, మనస్తత్వ నిరూపణలో పాత్రలను మలచడంలో శ్రీ ముల్కరాజ్ ఆనంద్ సిద్ధహస్తుడు.
1936లో వెలువడిన 'కూలీ' శ్రీ ఆనంద్ రచించిన నవలలో రెండవది. ఇది రష్యన్, జర్మన్, ఫ్రెంచి మొదలైన విదేశీయ భాషలలోనికి అనువదింపబడి పాఠకుల మన్ననలను పొందిన నవల. ఈ నవలలో ప్రధానపాత్ర 'మునూ' అనే ఒక కూలీ. నిరుపేద రైతుకుటుంబంలో పుట్టి, వున్న ఆ కాస్తభూమి భూస్వామి ఏనాడో అపహరించగా తను పుట్టినగడ్డ ఒదిలి పొట్ట చేత్తో పట్టుకొని, పట్టెడన్నం కోసం పడరాని పాట్లు పడుతూ ఒక ఇంటి నౌకరుగా, ఫ్యాక్టరీ కార్మికునిగా, చివరకు రిక్షాకూలీగా అనేక కష్టాలకు లోనయిన 'మునూ దుఃఖమయ జీవిత విముక్తికై, సుసంఘటిత పోరాటమే మారమని ఈ నవలలో ప్రతిపాదింపబడింది. కథానిర్వహణలో, మనస్తత్వ నిరూపణలో పాత్రలను మలచడంలో శ్రీ ముల్కరాజ్ ఆనంద్ సిద్ధహస్తుడు.© 2017,www.logili.com All Rights Reserved.