"అశ్వమేథం" లో గుర్రప్పందాలు వెనుక జరిగే మోసాలు, "కథ కానిది" లో రాయలసీమ జిల్లాలలో తరం నుంచి తరానికి వారసత్వంగా వచ్చే కుటుంబ కక్షలు, "లాస్ట్ ట్రిప్ లా" ఎన్ని కోట్లు గడించినా డబ్బుతో కొనలేని కొన్ని జీవితపు విలువ లుంటాయని ఆలస్యంగా గ్రహించిన బిలియనీర్ మనఃస్టితి "చలి మంటలు" లో భావ కవితాయుగం నాటి ఒక అజ్ఞాత వృద్ధ కవిని ఉద్దరించడానికి ఉబలాట పడిన హైదరాబాదు యువకుల బృందానికి ఎదురైనా ఆశాభంగం రచయిత చక్కగా వర్ణించాడు. పరస్పరం భిన్న కథా వస్తువులను తీసుకొని విశిష్ట కథన శైలితో రక్తి కట్టించే నేర్పు సదాశివరావులో పుష్కలమని ఈ సంపుటిలోని కథలు చాటుతున్నాయి.
సదాశివరావు ఒక సంపుటంగా రాదగినాన్ని సైన్స్ ఫిక్షన్ కథలు కూడా రాశారు. మామూలు సైన్స్ ఫిక్షన్ కథల కంటే భిన్నంగా, మానవ జాతి భూత వర్తమాన భవిష్యత్తులను ఒకానొక తాత్వికావేదనతో సమీక్షిస్తూ రాసిన ఆ కథలు కూడా పుస్తక రూపంలో వస్తే ఒక ఉత్తమ, విలక్షణ కథా రచయితగా సదాశివరావు సమగ్ర పాఠకులకు గోచరిస్తుంది.
"అశ్వమేథం" లో గుర్రప్పందాలు వెనుక జరిగే మోసాలు, "కథ కానిది" లో రాయలసీమ జిల్లాలలో తరం నుంచి తరానికి వారసత్వంగా వచ్చే కుటుంబ కక్షలు, "లాస్ట్ ట్రిప్ లా" ఎన్ని కోట్లు గడించినా డబ్బుతో కొనలేని కొన్ని జీవితపు విలువ లుంటాయని ఆలస్యంగా గ్రహించిన బిలియనీర్ మనఃస్టితి "చలి మంటలు" లో భావ కవితాయుగం నాటి ఒక అజ్ఞాత వృద్ధ కవిని ఉద్దరించడానికి ఉబలాట పడిన హైదరాబాదు యువకుల బృందానికి ఎదురైనా ఆశాభంగం రచయిత చక్కగా వర్ణించాడు. పరస్పరం భిన్న కథా వస్తువులను తీసుకొని విశిష్ట కథన శైలితో రక్తి కట్టించే నేర్పు సదాశివరావులో పుష్కలమని ఈ సంపుటిలోని కథలు చాటుతున్నాయి. సదాశివరావు ఒక సంపుటంగా రాదగినాన్ని సైన్స్ ఫిక్షన్ కథలు కూడా రాశారు. మామూలు సైన్స్ ఫిక్షన్ కథల కంటే భిన్నంగా, మానవ జాతి భూత వర్తమాన భవిష్యత్తులను ఒకానొక తాత్వికావేదనతో సమీక్షిస్తూ రాసిన ఆ కథలు కూడా పుస్తక రూపంలో వస్తే ఒక ఉత్తమ, విలక్షణ కథా రచయితగా సదాశివరావు సమగ్ర పాఠకులకు గోచరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.