ఎస్.ఎఫ్, సైఫీ, సైన్సెఫక్షన్, సైంటిఫిక్ ఫిక్షన్ వంటి పేర్లతో ప్రచారంలో ఉన్న సృజనాత్మక సాహిత్యాన్ని మనం తెలుగులో వైజ్ఞానిక కల్పనా సాహిత్యం అనవచ్చు. అసలు సైన్సు లేదా విజ్ఞన శాస్త్రానికి, కల్పనకూ సంబందమేమిటి? అన్న ప్రశ్న తలెత్తుతుంది. విజ్ఞాన శాస్త్రం ప్రయోగాల ద్వారా నిరూపితమైన విషయం. ఊహకు, కల్పనకు ఇందులో తావులేదు. ప్రమాణం ముఖ్యం. అయితే విజ్ఞాన శాస్త్రరీత్యా నిరూపణ కావలిసిన అంశాన్ని కనుక్కోవడానికి ముందు శాస్త్రవేత్త ఆలోచనల్లో ఊహకు ఆస్కారముంది. ప్రయోగాల పరంపరలో బయటపడే అనేక విషయాలున్నట్లే, ఒకదాన్ని కనుగొనే లక్ష్యంతో ప్రయోగాలు కూడా సాగుతాయి. ఎలా అయినా శాస్త్రవేత్తకు ఒక పద్ధతి, ఒక లక్ష్యం ఉండక తప్పదు.
-కె.సదాశివరావు.